Mrunal Thakur: నువ్వు నాలో స్ఫూర్తిని నింపావు

ABN , First Publish Date - 2023-07-28T18:46:31+05:30 IST

‘సీతారామం’ సీత, రామ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. (Happy birthday Dulquer Salmaan) శుక్రవారం దుల్కర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఆయనకు మృణాల్‌(Mrunal thakur) ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. ‘సీతారామం’ (Sita ramam) సెట్‌లో దిగిన కొన్ని ఫొటోలను దుల్కర్‌ గురించి రాసుకొచ్చారు. ‘

Mrunal Thakur: నువ్వు నాలో స్ఫూర్తిని నింపావు

‘సీతారామం’ సీత, రామ్‌కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. (Happy birthday Dulquer Salmaan) శుక్రవారం దుల్కర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఆయనకు మృణాల్‌(Mrunal thakur) ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. ‘సీతారామం’ (Sita ramam) సెట్‌లో దిగిన కొన్ని ఫొటోలను దుల్కర్‌ గురించి రాసుకొచ్చారు. ‘‘వినయం, ప్రతిభ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనసు కలిగిన ఇలాంటి సూపర్‌స్టార్‌ను నాకు పరిచయం చేసిన ‘సీతారామం’ మేకర్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. దుల్కర్‌ ఎన్నో రకాలుగా నువ్వు నాలో స్ఫూర్తిని నింపావు. నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కొత్త భాష నేర్చుకోవాలంటే భయపడే నాలో ధైర్యాన్ని నింపావు. మలయాళీ పాటలను నాకు పరిచయం చేసినందుకు, నా మొదటి తెలుగు చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు.. థ్యాంక్యూ. హ్యాపీ బర్త్‌డే దుల్కర్‌ సల్మాన్‌! నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

మృణాల్‌ పోస్ట్‌కు దుల్కర్‌ స్పందించారు. ‘మృణాల్‌.. ఇది చాలా స్పెషల్‌గా ఉంది. నీలో ప్రేరణ నింపేందుకు వేరే వ్యక్తులు అవసరం లేదు. ఎందుకంటే, నువ్వెంతో ప్రత్యేకమైన వ్యక్తివి. ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు ఎప్పటికీ సీత గారుగానే గుర్తుండిపోతావు’’ అని అన్నారు. ఇన్‌స్టాలో వీరిద్దరి సంభాషణను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘సీతారామం 2’ చేయొచ్చుగా అని కామెంట్లు పెడుతున్నారు. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటన చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-07-28T18:46:31+05:30 IST