Vijay Devarakonda - Pooja Hegde: వచ్చినట్లే వచ్చి చేజారింది..

ABN , First Publish Date - 2023-06-16T21:03:45+05:30 IST

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. అయితే చేతి నిండా అవకాశాలు ఉన్నా సరైన విజయాలు మాత్రం లేవు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అరడజను చిత్రాలు చేసినా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ప్రస్తుతం మహేశ్‌తో ‘గుంటూరు కారం’ చేస్తున్న ఈ అమ్మడికి కాలం కలిసి రావడం లేదని చెబుతున్నారు.

Vijay Devarakonda - Pooja Hegde: వచ్చినట్లే వచ్చి చేజారింది..

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) ఒకరు. అయితే చేతి నిండా అవకాశాలు ఉన్నా సరైన విజయాలు మాత్రం లేవు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అరడజను చిత్రాలు చేసినా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ప్రస్తుతం మహేశ్‌తో ‘గుంటూరు కారం’ చేస్తున్న ఈ అమ్మడికి కాలం కలిసి రావడం లేదని చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండతో పూరి జగన్నాథ్‌ తీయాలనుకున్న ‘జనగణమన’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక చేశారు. ‘లైగర్‌’ పరాజయంతో ‘జనగణమన’ చిత్రం ఊసే లేదు. దాంతో ఆ అవకాశం పక్కకి వెళ్లినట్లే అయింది.

విజయ్‌ దేవరకొండ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు సెట్స్‌ మీదకు వెళ్లబోతున్నాయి. అందులో ఒకటి పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘చిత్రం ఒకటి. మరొకటి గౌతమ్‌ తిన్ననూరి ‘వీడీ12’. (VD12) పూజాకు ‘జనగణమన’ చిత్రంలో మిస్‌ అయిన అవకాశం ఈ రెండు చిత్రాల్లో అయిన వరిస్తుంది అనుకున్నారు. అయినా ఇక్కడ కూడా ఆమె అవకాశాన్ని కోల్పోయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ‘వీడీ12’లో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో తొలుత పూజా హెగ్డేను అనుకున్నారు. అయితే ఆ అవకాశామూ చేజారింది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన పూజా స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal thakur) వచ్చి చేరింది. అందులో పాత్రలకు మృణాల్‌ అయితే న్యాయం చేయగలదని చిత్ర బృందం నమ్మడంతో ఇటీవల ఆమె సైన్‌ చేశారు. విజయ్‌ దేవరకొండ పక్కన నటించడం ఆనందంగా ఉందని మృణాల్‌ తెలిపారు.

Updated Date - 2023-06-16T21:03:45+05:30 IST