Sree leela - Mrunal : నటీమణుల మాటలకు నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2023-12-15T11:32:13+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్  ఎవరంటే మొదట వినిపించే పేరు శ్రీలీల. చిన్న సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అది కూడా అగ్ర కథానాయకులతో. తాజాగా నాని నటించిన ‘హాయ్‌ నాన్న’ చిత్రాన్ని చూశారామె.

Sree leela - Mrunal : నటీమణుల మాటలకు నెటిజన్లు ఫిదా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్  ఎవరంటే మొదట వినిపించే పేరు శ్రీలీల. చిన్న సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అది కూడా అగ్ర కథానాయకులతో. తాజాగా నాని నటించిన ‘హాయ్‌ నాన్న’ చిత్రాన్ని చూశారామె. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్‌ స్టాటస్‌లో ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న చిత్రమిదని, తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు.

‘‘హాయ్‌ నాన్న’ ఇదొక ఎమోషనల్‌ కథ. నాని.. ఈ కథతో మీరు ఎప్పటిలాగానే మా మనసుని తాకారు. మృణాల్‌ నటన, ఆమె లుక్‌ మా హృదయాన్ని దోచుకున్నాయి. బేబీ కియారా అయితే క్యూట్‌గా ఉంది. స్ర్కీన్‌పై తనని చూసిన ప్రతి ఒక్కరూ కిడ్నాప్‌ చేేసయాలనుకున్నారు. అద్భుతమైన సినిమాను ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్‌కు కంగ్రాట్స్‌’’ అని శ్రీలీల పోస్ట్‌ చేశారు. దీని మృణాల్‌ స్పందించారు.

shreeleela.jpeg

‘‘థ్యాంక్యూ సో మచ్‌ స్వీట్‌ హార్ట్‌. ఈ సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నాకు ఎంతో స్ఫూరి. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు వర్క్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. అందుకు నీ విషయంలో నేనెంతో గర్వపడుతున్నా’’ అని రిప్లై ఇచ్చారు. మృణాల్‌ మాటలకు శ్రీలీల కూడా స్పందించారు. ‘‘మీ మాటలు నాకెంతో విలువైనవి. నాకు ఆనందాన్ని అందించాయి’’ అని అన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతేడాది విడుదలైన ‘ధమాకా’, ‘సీతారామం’తో చిత్రాలతో వీరిద్దరూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. తాజాగా వీరిద్దరి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. మృణాల్‌ నటించిన ‘హాయ్‌ నాన్న’ విడుదలైన తర్వాతి రోజు శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మిశ్రమ స్పందనలకు పరిమితం కాగా, ‘హాయ్‌ నాన్న’ హిట్‌ అందుకుంది.

Updated Date - 2023-12-15T11:32:14+05:30 IST