Mohanbabu: ‘బలగం’ చూసి ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2023-04-04T17:57:40+05:30 IST

‘బలగం’ (Balagam) చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. చిన్న సినిమాగా రూపొంది, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.

Mohanbabu: ‘బలగం’ చూసి ఏమన్నారంటే!

‘బలగం’ (Balagam) చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. చిన్న సినిమాగా రూపొంది, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఓటీటీలో విడుదలయ్యాక ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు విభాగాల్లో నాలుగు అవార్డులను ప్రకటించారు. ఎక్కడ చూసిన ప్రసంశల వర్షంలో మునుగుతోందీ చిత్ర బృందం.

తాజాగా మంచు మోహన్‌బాబు (Mohanbabu), విష్ణు(Vishnu) ‘బలగం’ బృందాన్ని అభినందించారు. ఇటీవల మోహన్‌బాబు ‘బలగం’ చిత్రాన్ని వీక్షించారు. బంధాలు, భావోద్వేగాలతో చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ నటీనటులుగా జబర్దస్ట్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించారు.

Untitled-1.jpg

Updated Date - 2023-04-04T17:58:43+05:30 IST