SS Rajamouli: ఆ సర్‌ప్రైజ్‌కు పెద్దన్న కన్నీళ్లు పెట్టుకున్నారు!

ABN , First Publish Date - 2023-03-16T14:47:15+05:30 IST

అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి తన పెద్దన్న కీరవాణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.

SS Rajamouli: ఆ సర్‌ప్రైజ్‌కు పెద్దన్న కన్నీళ్లు పెట్టుకున్నారు!

అమెరికా దిగ్గజ సంగీతకారుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి తన పెద్దన్న కీరవాణి (Keeravani Emotional) ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS rajamouli) అన్నారు. ఆస్కార్‌ 2023 (Oscar 95) వేదికపై ‘నాటు నాటు’ (Naatu naatu) పాటకు గానూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంగా ఆస్కార్‌ అందుకున్న కీరవాణి ‘రిచర్డ్‌ కార్పెంటర్స్‌ పాటలు వింటూ పెరిగానని ప్రశంసించారు. కార్పెంటర్స్‌ (Richard Carpenter performs song) పాపులర్‌ సాంగ్‌ అయిన ‘టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ సాంగ్‌ను కీరవాణి తనదైన శైలిలో వేదికపై పాడారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన రిచర్డ్‌ కార్పెంటర్‌ కీరవాణి, చంద్రబోస్‌లకు (ChandraBose) శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో చేశారు. తన కుమార్తెలతో కలిసి ‘టాప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌...’ పాటను ఆలపిస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కంగ్రాట్స్‌ చెప్పారు. ఆ పోస్ట్‌పై కీరవాణి (MM Keeravani) ఆనందం వ్యక్తం చేశారు. కార్పెంటర్‌ పోస్ట్‌ చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని ఇన్‌స్టాలో పేర్నొన్నారు. దీనిపై తాజాగా రాజమౌళి కూడా స్పందించారు.

‘‘ఆస్కార్‌ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ మొత్తం పెద్దన్న ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ‘నాటు నాటు’ పాట స్కార్‌కి నామినేట్‌ అయిందనే విషయం తెలిసినప్పటి నుంచి ఆనందం వ్యక్తం చేశారు కానీ ఎక్కడా భావోద్వేగాన్ని బయటపెట్టలేదు. ఆస్కార్‌ గెలుపొందడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఏ విధమైన ఉద్వేగాన్నీ బయటపెట్టలేదు. కానీ, మీ పోస్ట్‌ చూశాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటుంబానికి ఇదొక మధురానుభూతి’’ అని రాజమౌళి రిచర్డ్‌ కార్పెంటర్‌ పోస్ట్‌కు కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఉపాసన కొణిదెల, సింగర్‌ శ్వేతా మోహన్‌ తదితరులు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను అభినందిస్తూ కామెంట్లు చేశారు.

Updated Date - 2023-03-16T15:20:13+05:30 IST