Mithunam writer is no more: 'మిధునం' రచయిత శ్రీరమణ ఇక లేరు

ABN , First Publish Date - 2023-07-19T11:07:40+05:30 IST

ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ నిన్న రాత్రి కన్నుమూశారు. అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ నిన్న రాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన 'మిథునం' సినిమా రచయిత శ్రీరమణ. అలాగే పేరడీ రచనలకు ప్రసిద్ధి ఈయన.

Mithunam writer is no more: 'మిధునం' రచయిత శ్రీరమణ ఇక లేరు
Popular writer and journalist Sreeramana is no more

ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ నిన్న రాత్రి కన్నుమూశారు. (Famous writer and journalist Sreeramana is no more) అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ నిన్న రాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి (ThanikellaBharani) దర్శకత్వంలో వచ్చిన 'మిథునం' #Mithunam సినిమా రచయిత శ్రీరమణ కావటం విశేషం. ఆ సినిమా పెద్ద హిట్ అవటమే కాకుండా, రచయిత శ్రీరమణ గారికి, దర్శకుడు తణికెళ్ల భరణికి మంచి పేరు తీసుకువచ్చింది. పేరడీ రచనలకు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా, అలాగే సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణ గారికి మంచి పేరుంది. అయన ఆయన 'పత్రిక' అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా కూడా ఉన్నారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఎస్ పి బాలసుబ్రమణ్యం (SPBalasubramanyam), లక్ష్మి (Lakshmi) గారు 'మిథునం' సినిమాలో నటించారు, ఈ కథ కేవలం రెండు పాత్రలపైనే ఉంటుంది.

అసలు పేరు వంకమామిడి రాధాకృష్ణ లేదా రమణగారు, 1952, సెప్టెంబర్ 21న గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం అనే గ్రామంలో జన్మించారు. స్కూల్ రోజుల నుండే రమణ గారు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. వేమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. అప్పుడే, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. రమణగారికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, వరసగా ఆరేళ్ళు ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. అలాగే రమణగారు పన్నెండేళ్ళ వయసులో వున్నప్పుడు విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది.

శ్రీ రమణ అనేది అయన మార్చుకున్న పేరు. బాపట్లలో వారి తాతగారి ఇంట వుండి కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పియుసిలో చేరారు. అయితే (తల్లిగారు తరపున) తాతగారికి ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు. అప్పుడు రమణ గారిని దత్తత తీసుకున్నారు. అప్పటివరకు వంకమామిడి రాధాకృష్ణ గా వున్న అతను దత్తత తీసుకున్నాక పేరు కామరాజు రామారావుగా మారింది. రెండు పేర్లు, రెండు ఇంటి పేర్లు ఎందుకు అందరికీ గందరగోళం పెట్టడం అని 'శ్రీ రమణ' గా మార్చుకున్నారు.

శ్రీ రమణ గారు పేరు సాహితీ ప్రపంచంలో వినని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు, ముఖ్యంగా ప్రతి తెలుగు వాడుకి అయన పేరు సుపరిచితం. ఎందుకంటే అంతని రచనలో తెలుగుదనం ఉంటుంది, తియ్యదనం ఉంటుంది. చాలా పత్రికలలో రమణగారు పేరడీలు, శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి శీర్షికలు నిర్వహించారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన 'మిథునం' సినిమా శ్రీ రమణ గారి రాసిన కథే. ఈ కథని ఎంతో నచ్చి, మెచ్చి ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు (Bapu) తన స్వీయ దస్తూరితో ఈ కథని రాసి రమణగారి పంపారు. అయన ఆలా చేస్తే, ప్రముఖ సాహితీ ప్రియులు జంపాల చౌదరిగారు ఆ బాపుగారి దస్తూరితోనే వున్నా కథను అలానే ప్రచురించి 'మిథునం' పుస్తకరూపంలో నాలుగులక్షల మందికి పైగా అందచేశారు. ఈ 'మిథునం' కథ అంటే రాసిన శ్రీరమణ గారికి కూడా ఎంతో ఇష్టం, అందుకే తనకి బాల్యం నుంచి మనసులో నాటుకున్న ఆలోచనలకు ఈ కథ ఒక అక్షరరూపం అని చెపుతూ వుంటారు. అలాగే ఇది ఎన్నో సంప్రదాయ కుటుంబాల కథ అని కూడా చెబుతుంటారు.

కొన్ని నెలల క్రితం 'మిథునం' సినిమా నిర్మాత ఎం ఆనంద రావు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా రచయిత రమణగారు కాలం చేసి, సినిమా ప్రేక్షకులను, సాహితీ ప్రియులను విషాదంలో ముంచెత్తారు.

Updated Date - 2023-07-19T11:07:40+05:30 IST