Miss Shetty Mr. Polishetty : నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-09-07T10:07:32+05:30 IST

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత అనుష్క తెరపై కనిపిస్తున్న చిత్రం ‘‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌ పోలిశెట్టి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Miss Shetty Mr. Polishetty : నెటిజన్లు ఏమంటున్నారంటే..

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత అనుష్క తెరపై కనిపిస్తున్న చిత్రం ‘‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌ పోలిశెట్టి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నవీన్‌ స్టాండప్‌ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటించారు. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాకు మరితం క్రేజ్‌ పెరిగింది. అనుష్క ప్రమోషన్స్‌కి హాజరు కాకపోయినా దర్శకుడు, నవీన్‌ తమ భుజాలపై ఆ భారాన్ని వేసుకుని వినూత్న రీతిలో సినిమాను ప్రమోట్‌ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు బెస్ట్‌ రివ్యూ ఇచ్చారు. ఒకసారి చూసినా మరోసారి ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూడాలనుందని చెప్పుకొచ్చారు భారీ అంచనాల మఽఽధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో చూద్దాం.

ట్విటర్‌లో నుంచి సినిమాకు మంచి స్పందన వస్తోంది. మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రమిదనీ, కామెడీ, స్ర్కీన్‌ప్లే, భావోద్వేగాలు సినిమాకు ప్లస్‌ అని చెబుతున్నారు. నవీన్‌ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్కకు కమ్‌బ్యాక్‌ మూవీ ఇది అని రాసుకొస్తున్నారు. నవీన్‌ సినిమాకు డైనోసర్‌లా వన్‌మెన్‌ షోలా యాక్ట్‌ చేశాడని ఓ నెటిజన్‌ చెప్పుకొచ్చారు. అనుష్క స్ర్కీన్‌ ప్రజెన్స్‌కి ఏం పేరు పెట్టగలం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2023-09-07T10:28:38+05:30 IST