Anushka : ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ ప్రత్యేక ఆఫర్‌!

ABN , First Publish Date - 2023-09-12T16:11:45+05:30 IST

అనుష్కశెటి, నవీన్‌ పోలిశెట్టి కీలక పాత్రధారులుగా మహేశ్‌.పి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ ఫుల్‌గా ఆడుతోంది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది.

Anushka : ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ ప్రత్యేక ఆఫర్‌!

అనుష్కశెటి(Anushka), నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్రధారులుగా మహేశ్‌.పి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ ఫుల్‌గా ఆడుతోంది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఓ పక్క మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వసూళ్లు వర్షం కురిపిస్తున్న ‘జవాన్‌’ హవా నడుస్తున్నా ఈ చిత్రానికీ చక్కని ఆదరణ లభిస్తోంది. వసూళ్లు నిలకడగా ఉన్నాయి. అయితే ఈ చిత్ర బృందం మహిళా ప్రేక్షకులకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. (Spl show For ladies)

ఆ వివరాలు వెల్లడిస్తూ.. అనుష్క ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘మా చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. మీ మెసేజ్‌లు, ట్వీట్స్‌, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గురువారం ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో మహిళలకు మాత్రమే ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నాం. మీ ఇంట్లో పెద్దల్ని, చిన్నల్ని తీసుకొని వెళ్లండి’’ అని అనుష్క ట్వీట్‌లో పేర్కొన్నారు. యువి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Updated Date - 2023-09-12T16:45:41+05:30 IST