Miss Shetty Mr. Polishetty : సినిమా చూసి చిరంజీవి ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-09-05T14:28:20+05:30 IST

విడుదలకు ముందే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా అభిమానులతో పంచుకునని సినిమా బృందానికి అభినందనలు తెలిపారు.

Miss Shetty Mr. Polishetty : సినిమా చూసి చిరంజీవి ఏమన్నారంటే..!

విడుదలకు ముందే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా అభిమానులతో పంచుకునని సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాదు సినిమాకు రివ్యూ కూడా ఇచ్చేశారు. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడాలనే కోరిక కలిగిందని అన్నారు.

2.jpg

"మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి 'దేవసేన', అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్అ బాబుని అభినందించాల్సిందే.  ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు' అని అన్నారు" అని పోస్ట్‌లో చిరు పేర్కొన్నారు.

Chiranjeevi.jpg

చిరంజీవి పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ సైతం ఆల్‌ ది బెస్ట్‌ అంటూ నవీన్‌ పోలిశెట్టికి అభినందనలు చెబుతున్నారు. నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి కీలక పాత్రధారులుగా మోస్ట్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్‌ బాబు దర్శకుచి?గా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 7న థియేటర్లో సందడి చేయనుందీ చిత్రం.

Updated Date - 2023-09-05T15:05:31+05:30 IST