Tollywood: టాలీవుడ్ ను వదలని విషాదం, నిర్మాత కన్నుమూత

ABN , First Publish Date - 2023-03-16T11:30:26+05:30 IST

'మిధునం' వంటి కళాత్మకమయిన సినిమా అందించిన నిర్మాత ఆనందరావు బుధవారం ఉదయం కన్నుమూశారు

Tollywood: టాలీవుడ్ ను వదలని విషాదం, నిర్మాత కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. 'మిధునం' (Midhunam) వంటి మంచి కళాత్మకమయిన సినిమా అందించిన నిర్మాత మొయిద ఆనంద రావు (Moyida Ananda Rao) కన్ను మూసారు. అతను వయసు 57 సంవత్సరాలు. అతను మధుమేహంతో (Diabetic) చాలా కాలం నుండి బాధపడుతూ వున్నాడు. గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో, వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేక, బుధవారం ఉదయం కన్ను మూసారు.

మొయిద ఆనందరావు సీతారాంపురం దగ్గర, వావిలవలస (Vavilavalasa) అనే చిన్న గ్రామం లో పుట్టాడు. ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఆనందరావు మంచి సంఘసేవకుడు కూడా. తన స్వంత వూరు అయినా వావిలవలస లో 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసాడు. మొదటి నుండీ కూడా తెలుగు సాహిత్యం అన్న, వాటిని చదవటం అన్నా ఆనందరావు కి ఇష్టమయిన వ్యాపకాల్లో ఒకటి.

midhunamproducer.jpg

ఆ సాహిత్యం లో వున్న మక్కువతోటె 'మిథునం' (Midhunam) సినిమా నిర్మాణం చెయ్యాలని తలచాడు ఆనందరావు. ఈ సినిమాకి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి (Thanikella Bharani) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎస్.పి. బాలసుబ్రత్య్మన్యం SP Balasubramanyam), లక్ష్మి (Lakshmi) నటించారు. ఈ సినిమా మొత్తం ఈ ఇద్దరే నటులతోటే తీశారు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. మొయిద ఆనందరావు అంటే ప్రపంచానికి తెలిసింది ఈ సినిమా వలనే. ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఆనందరావు కి భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు.

midhunamproducer1.jpg

మిధునం సినిమా షూటింగ్ అంతా మొయిద ఆనందరావు ఇంట్లో షూటింగ్ చేశారు. అది ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు ఆనందరావు. రాజాం దగ్గర, రేగిడి ఆమూలాదాలవలస మండలం లో ఈ వావిలవలస వుంది. మిథునం సినిమా గుర్తున్నంత కాలం ఆనందరావు గుర్తు ఉంటాడు. అంత్యక్రియలు వావిలవలసలో శుక్రవారం జరుగుతాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. అమెరికా నుండి పెద్ద కూతురు రావాల్సి ఉందని, అందుకని శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని తెలిసింది.

Updated Date - 2023-03-16T11:30:28+05:30 IST