Megha Akash: సఃకుటుంబనాం సెట్స్‌లో మేఘా ఆకాష్ పుట్టినరోజు వేడుక

ABN , First Publish Date - 2023-10-27T11:34:44+05:30 IST

ఛ‌ల్ మోహ‌న‌రంగా, లై, రావ‌ణాసుర చిత్రాల ద్వారా అల‌రించిన హీరోయిన్ మేఘాఆకాశ్(Megha Akash) పుట్టిన రోజు వేడుకలు గురువారం సఃకుటుంబ‌నాం(Sahkutumbanaam) సినిమా సెట్ టో ఘనంగా జరిగాయి.

Megha Akash: సఃకుటుంబనాం సెట్స్‌లో మేఘా ఆకాష్ పుట్టినరోజు వేడుక
Megha Akash

ఛ‌ల్ మోహ‌న‌రంగా, లై, రావ‌ణాసుర చిత్రాల ద్వారా అల‌రించిన‌ హీరోయిన్ మేఘాఆకాశ్ (Megha Akash) పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తాజాగా అమె యువ నటుడు రామ్‌కిర‌ణ్‌తో జంట‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం ప్రధానాంశంగా రూపొందుతున్న సఃకుటుంబ‌నాం(Sahkutumbanaam) చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమై మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ లో మేఘాఆకాష్ జన్మదినాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ మాలి, పాట‌లు: అనంత్ శ్రీ‌రామ్‌, కెమెరా: మ‌ధు దాస‌రి, ఆర్ట్‌: పీఎస్ వ‌ర్మ‌, అడిష‌నల్ స్కిన్‌ప్లే: బాలాజి భువ‌న‌గిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రోహిత్ ప‌ద్మ‌నాభం, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌శ‌ర్మ‌.మోగా ఆకాశ్ చివ‌ర‌గా తెలుగులో మ‌ను చ‌రిత్ర‌, రావ‌ణాసుర చిత్రాల‌లో క‌నిపించింది.

Updated Date - 2023-10-27T11:34:44+05:30 IST