Chiranjeevi: బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా..

ABN , First Publish Date - 2023-01-09T03:12:06+05:30 IST

రెండు సంవత్సరాలుగా.. బాబీని అడుగడుగునా గమనిస్తున్నాను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్‌కి, బాబీ తీసుకున్న శ్రద్దాసక్తులకి.. నేను బాబీ అభిమానినయ్యాను అన్నారు మెగాస్టార్..

Chiranjeevi: బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా..
Chiranjeevi speech at Waltair Veerayya Pre Release Event

రెండు సంవత్సరాలుగా.. బాబీని అడుగడుగునా గమనిస్తున్నాను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్‌కి, బాబీ తీసుకున్న శ్రద్దాసక్తులకి.. నేను బాబీ అభిమానినయ్యాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఆయన హీరోగా, రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాబీ (Bobby) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 13న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం వైజాగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ..

‘‘బాబీ గురించి చెప్పాలంటే.. నన్ను అభిమానిస్తాడు.. చాలా సంతోషం. అలా అభిమానించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ కోట్లు పెట్టి సినిమాలు తీసే దానిలో అభిమానాలు, ప్రేమలు కాదు. మనం అందరం ఒక్కటై సినిమాని, కథని ప్రేమించి.. దానిని అందంగా తెరపైకి తీసుకువచ్చి.. ప్రజలు దానిని ప్రేమించేలాగా, దాని నుంచి వినోదం పొందేలాగా చేయగలిగితేనే మనద్దరి మధ్య ఉన్న ప్రేమకి అర్థం, పరమార్థం ఉంటుంది. అభిమాని అయినంత మాత్రమే సినిమా అయిపోదు.. ప్రజలని అలరించాలి. అది మన మెయిన్ మోటో అనుకున్నాం. ఈ సినిమా చేసినన్ని రోజులూ.. బాబీపై ప్రేమ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దానికి కారణం అతడు కష్టపడేతత్వం. ఫోకస్డ్‌గా పనిచేయడం.. ఎవరు ఏది చెప్పినా సరే.. ఈగోకి వెళ్లకుండా.. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న మనిషి చెప్పాడంటే దానికి ఏదో అర్థం ఉంటుంది.. దానిని కరెక్ట్ చేసుకురావాలి.. అంటూ అహర్నిశలు.. ఇంకొంచెం బెటర్‌గా చేయడం కోసంగా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా ఈ సినిమా మొదటి రోజు విన్నదానికంటే.. ఆ తర్వాత తర్వాత రూపాంతరం చెందింది అత్యద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత.. ఇక ఢోకా లేదు.. ఇది ప్రతి ఒక్కరినీ.. ఆ క్లాసూ, ఈ క్లాసూ, లేడీసూ, యంగ్‌స్టర్స్ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అలరించే సినిమా ‘వాల్తేరు వీరయ్య’. నాకు బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు. ఒకడు కథకుడు, రెండో వాడు రచయిత, మూడు స్క్రీన్‌ప్లే రైటర్.. ఆ తర్వాత నాలుగో వ్యక్తే డైరెక్టర్. ఆ తర్వాతే అతని అభిమానాన్ని నేను చూస్తాను. అభిమాని కదా అని చెప్పి ఈ సినిమా ఇవ్వలా.. అతని టాలెంట్ అత్యద్భుతం అని చెప్పి ఈ సినిమా ఇచ్చాను. నా నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. నేను పెట్టుకున్న నమ్మకానికి డబుల్‌గా ఈ సినిమాని అందరికీ అందించాడు. (Chiranjeevi Speech)

ఇది కమర్షియల్ సినిమానా అని అడిగితే.. యస్ ఇది పక్కా కమర్షియల్ సినిమానే. కానీ తేలిగ్గా అనుకునే కమర్షియల్ సినిమా కాదు. ఒక కమర్షియల్ సినిమాకు ఏమేం కావాలో వాటన్నింటిని చాలా చక్కగా పొందుపరిచాడు. ప్రతి క్షణం నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు.. అలరిస్తుంటాడు. ఉద్వేగ పరిచేలాగా పోరాట సన్నివేశాలు ఉంటాయ్. ఇట్స్ ఏ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఈ ‘వాల్తేరు వీరయ్య’. ఎక్కడా ఊపిరి సలుపుకోనివ్వడు. కొంచెం సేపటికే మనం సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి.. ఇదిరా సినిమా అంటే.. అంటూ దీని కోసమే కదా.. ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి ప్రతి ఒక్కరి చేత అనిపిస్తాడు బాబీ. నా సినిమాల గురించి ముందస్తుగా చెప్పుకునే అలవాటు చాలా చాలా తక్కువ. మా ప్రయత్నం మేము చేశాం.. అలరిస్తుందనే అనుకుంటున్నాము. అలాంటి ఆశాభావంతోనే ఎదురుచూస్తున్నాము. మీ ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయనే అనుకుంటున్నామని.. కొంచెం జాగ్రత్తగా తప్పించుకునే మాటలు మాట్లాడతాము కానీ.. ఈ సినిమాకు మాత్రం ఆ అవసరం లేదు. బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సైన కమర్షియల్ సినిమా. మీ చేత శభాష్ అనిపించుకునే సినిమా. అందుకే యూనిట్‌లోని ప్రతి ఒక్కరం కాన్ఫిడెంట్‌గా మీ ముందుకు వచ్చి చెబుతున్నాం. బాబీ తన పనితనాన్ని అలా చూపించుకుంటూ వెళుతుంటే ఎంత ముచ్చట వేసేది అంటే.. ‘బాబీ కథ అందరూ బాగుందని అన్నారు.. మనం షూట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే..’.. చెప్పండి అన్నయ్యా అంటూ.. ఆ చెప్పిన విషయాన్ని రెండుమూడు గంటల టైమ్ తీసుకుని.. రైటర్స్ కోన వెంకట్, చక్రిగార్లతో డిస్కస్ చేసి వచ్చిన తర్వాత అత్యద్భుతంగా దానిని చెప్పడం చూసిన తర్వాత.. మనిషిలో ఎంత కసి ఉందనేది నాకు తెలిసొచ్చింది. సాధారణంగా ఎవరి సినిమాలైనా సరే.. బాగున్న కథ సోసోగా.. యావరేజ్‌గా, ఎబౌ యావరేజ్‌గా లేదంటే హిట్ రేంజ్‌లో ఆగిపోతాయి. కానీ అదే కథని నిరంతరం చెక్కుతూ ఉంటే కనుక.. అవి ఎంత షైనింగ్ చేస్తే అంతగా.. అవి మరింత బ్రహ్మాండంగా వస్తాయి. (Waltair Veerayya Pre Release Event)

ఎందుకంటే.. ఎవరైతే కథకుడు ఉన్నాడో.. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో.. వాడు విశ్రాంతి చెందకూడదు.. వచ్చేసింది కదా అని సంతృప్తి చెందకూడదు. ఏ డైరెక్టర్‌కి అయితే ఒక మంచి కథ మీద సంతృప్తి ఉండదో.. అసంతృప్తితో ఉంటూ.. ఇంకా ఏదో చేయాలని తపన పడతాడో.. వాడి కథ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఈ రోజు వరకు కూడా అతను విశ్రాంతి పొందలేదు. చాలా బాగుంది కదా.. చాలా బాగా వచ్చింది కదా.. ఇక వదిలేయవచ్చు కదా.. ఇంకా ఎందుకు ఎడిటింగ్ రూమ్‌కి వెళ్లి ఓ కష్టపడుతున్నావంటే.. ‘లేదన్నయ్యా.. ఎక్కడో కొంచెం కొడుతుంది. అది కూడా కరెక్ట్ చేస్తే.. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను’ అంటాడు. ఏమనుకుంటున్నావ్ కరెక్షన్స్ అంటే.. అక్కడ కరెక్షన్స్ చూపిస్తాడు. నిజంగా చాలా బాగుంటుంది.. నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనిపిస్తుంది. చాలా బాగా ఆలోచించాడు.. వెరీ గుడ్ అనిపిస్తుంది. తాజాగా ల్యాబ్‌లో సినిమా చూస్తున్నాం.. అక్కడ కూడా చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయని.. ఆదివారం మార్నింగ్ 5 గంటల వరకు ఎడిటింగ్ రూమ్‌లో ఉండి.. అవన్నీ కరెక్ట్ చేసుకుని.. ఇక ఓకే అనుకున్న తర్వాత.. ఇవాళ ఫ్లైట్ ఎక్కి ఈ వేడుకకు వచ్చాడు. (Megastar Chiranjeevi Speech)

ఎందుకంత ఇష్టం అంటే అతను నా అభిమాని.. నన్ను ప్రేమిస్తున్నాడనేది కానే కాదు. నాకు అభిమానులు చాలా మంది ఉంటారు. అది కాదు కావాల్సింది.. ఎవరైతే వర్క్‌ని ప్రేమిస్తారో.. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో.. అలాంటి వాడు నాకు అభిమాని. అలాంటివారికి నేను అభిమానిని. రెండు సంవత్సరాలుగా.. అతనిని అడుగడుగునా గమనిస్తున్నాను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్‌కి, బాబీ తీసుకున్న శ్రద్దాసక్తులకి.. నేను బాబీ అభిమానినయ్యాను. ప్రతి ఒక్కరూ అతనిని స్ఫూర్తిగా తీసుకుని.. వచ్చిన సబ్జెక్ట్‌కు సంతృప్తి చెందక.. ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూ ఉండండి.. ఖచ్చితంగా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తితో నేను ట్రావెల్ చేశాను. నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు. (Waltari Veerayya Chiranjeevi Film)

Updated Date - 2023-01-09T03:12:08+05:30 IST