Guntur Karam: పూజా పోయే.. మీనాక్షి వచ్చే..

ABN , First Publish Date - 2023-06-24T11:44:00+05:30 IST

మహేశ్‌ (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur karam) టీమ్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొద్దిరోజులు వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్‌ చిత్రం నుంచి తప్పుకొన్నాడనీ గాసిప్పులొచ్చాయి. అయితే ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు. తనదైన శైలిలో ట్వీట్‌ చేసి ఘాటుగా సమాధానం చెప్పారు. అలాగే హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja hegde)విషయంలోనూ అలాంటి వదంతులే వినిపించాయి.

Guntur Karam: పూజా పోయే.. మీనాక్షి  వచ్చే..

మహేశ్‌ (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur karam) టీమ్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొద్దిరోజులు వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్‌ చిత్రం నుంచి తప్పుకొన్నాడనీ గాసిప్పులొచ్చాయి. అయితే ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు. తనదైన శైలిలో ట్వీట్‌ చేసి ఘాటుగా సమాధానం చెప్పారు. అలాగే హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja hegde)విషయంలోనూ అలాంటి వదంతులే వినిపించాయి. పూజా ఈ చిత్రం నుంచి అవుట్‌ అనే వార్తలు హల్‌చల్‌ చేసినా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. పూజా సన్నిహితులు మాత్రం ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొందనే చెబుతున్నారు. (Pooja hegde out)

ఇప్పుడు ఆ స్థానంలోకి మెయిన్‌ హీరోయిన్‌గా శ్రీలీల వచ్చింది. రెండో హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల స్థానంలోకి మీనాక్షి చౌదరి (Meenakshi Choudhari in) వచ్చి చేరిందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. తొలుత పూజా ప్లేస్‌లో సంయుక్తా మీనన్‌ను తీసుకోవాలని భావించినా మహేశ్‌ పక్కన హైట్‌ పరంగా అంత సూటబుల్‌ కాదని చివరి నిమిషంలో మీనాక్షిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. శనివారం నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ మొదలుపెట్టినట్లు సమాచారం. మీనాక్షి చౌదరి ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’, ‘ఖిలాడీ’, ‘హిట్‌ 2’ చిత్రాలతో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే!

Updated Date - 2023-06-24T11:44:19+05:30 IST