సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Meenakshi chaudhary: నాకంటూ కొన్ని నియమాలున్నాయి.. వాటిని దాటను!

ABN, First Publish Date - 2023-07-25T16:55:51+05:30

‘ఇచ్చట వాహనమలు నిలపరాదు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘హిట్‌-2’తో సూపర్‌ హిట్‌ అందుకొంది మీనాక్షి చౌదరి. ‘గుంటూరు కారం’ చిత్రంలో ప్రస్తుతం మహేశ్‌ సరసన నటించే అవకాశం వరించింది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసింది మీనాక్షి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కెరీర్‌ తొలినాళ్లలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం ఆనందంగా ఉందని చెప్పింది.

‘ఇచ్చట వాహనమలు నిలపరాదు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘హిట్‌-2’(hit2)తో సూపర్‌ హిట్‌ అందుకొంది మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary). ‘గుంటూరు కారం’ (guntur karam)చిత్రంలో ప్రస్తుతం మహేశ్‌ సరసన నటించే అవకాశం వరించింది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసింది మీనాక్షి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో...


కెరీర్‌ తొలినాళ్లలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చాలా కథలు వింటున్నాను. కథల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నాను. బిజీగా ఉండడం కోసం కాకుండా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. ఏదైనా సన్నివేశం నాకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని ముందుగానే అంగీకరించను. ఇలా ఎన్నో సినిమాలు తిరస్కరించాను. కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నియమం పెట్టుకున్నా. అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని కారణంగా ఎన్నో అవకాశాలను తిరస్కరించాను. కొత్త తరహా పాత్రల్లో నటించేందుకు వెనక్కి తగ్గను. అవకాశం ఉన్నప్పుడే విభిన్న పాత్రల్లో నటించాలని నా అభిప్రాయం. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఏ భాషల్లో అయినా గొప్ప సినిమాల్లో అవకాశం వస్తే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ప్రస్తుతం తెలుగులో మహేశ్‌ బాబు , విష్వక్‌ ేసన్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాల్లో నటిస్తున్నా’’ అని చెప్పింది. (Meenakshi chaudharyno for kiss Scenes)

Updated Date - 2023-07-25T16:58:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!