Manchu Vishnu: మరో వీడియోతో విష్ణు సర్‌ప్రైజ్‌.. నెటిజన్లు ఫైర్‌!

ABN , First Publish Date - 2023-03-30T21:44:28+05:30 IST

మంచు కుటుంబంలో(Manchu Family) కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే వార్త చాలాకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే!

Manchu Vishnu: మరో వీడియోతో విష్ణు సర్‌ప్రైజ్‌.. నెటిజన్లు ఫైర్‌!

మంచు కుటుంబంలో(Manchu Family) కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే వార్త చాలాకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! తాజాగా మంచు మనోజ్‌ విడుదల చేసిన ఓ వీడియో దానికి మరింత బలం చేకూర్చిందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మంచు కుటుంబంలో ఎంతోకాలంగా పని చేస్తున్న సారథి ఇంట్లోకి చొరబడి అతనిపై విష్ణు చేయి చేసుకున్న వీడియో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ వీడియో సోషల్‌ మీడియా నుంచి తొలగించారు మనోజ్‌. తాజాగా మంచు విష్ణు మరో వీడియోతో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ వీడియోలో మంచు విష్ణు (Manchu Vishnu) చేస్తున్న ఓ రియాలిటీ షోకు సంబంధించిన కంటెంట్‌ ఉంది. దీనికి ‘హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌’ (House of Manchus) అని నామకరణం చేశారు. త్వరలోనే ఇది ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మనోజ్‌ పోస్ట్‌ చేసిన వీడియో కూడా దీనిలో భాగమే అని తెలుస్తోంది. (Manchu Vishnu post viral)

మంచు అన్నదమ్ములు పోస్ట్‌ చేసిన వీడియోలను కొందరు సరదాగా తీసుకున్నా.. కొందరైతే మండిపడుతున్నారు. ‘ఏదో సరదాగా చేశారులే’ అంటూ కొందరు సపోర్ట్‌గా ఉన్నారు. ఇంకొందరు నెటిజన్లు అయితే ‘ఆడుకోవడానికి నెటిజన్లే దొరికారా? ఏప్రిల్‌ నెల రాకుండానే జనాలను ఫూల్స్‌ చేశారు’ అని పోస్ట్‌ పెట్టారు. ‘ (netizens comments on Vishnu)

ఎందుకన్నా ఇవన్నీ... అసలే ట్రోలర్స్‌ ఆకలితో ఉన్నారు.. ఆడేసుకుంటారు. నీ ఫ్యాన్‌గా చెబుతున్నా.. ఇలాంటివి వద్దు.. ఇంక నీ యిష్టం. లేదంటే ట్రోలర్స్‌కి బిర్యాని అయిపోతావ్‌’’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. ‘మీ మధ్య ఎన్ని ఉన్నా.. ఈ వయసులో పెద్దయనను ఇబ్బంది పెట్టొద్దు’’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-03-30T21:49:43+05:30 IST