Allu Arjun - Manchu Vishnu : జాతీయ పురస్కార గ్రహీతకు మంచు విష్ణు లేఖ!

ABN , First Publish Date - 2023-09-10T12:34:15+05:30 IST

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపికై చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్‌. ఈ సందర్భంగా తాజాగా అల్ల్లు అర్జున్‌ను అభిమానులు అభినందిస్తూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ఒక లేఖ విడుదల చేశారు.

Allu Arjun - Manchu Vishnu : జాతీయ పురస్కార గ్రహీతకు మంచు విష్ణు లేఖ!

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి(National award) ఎంపికై చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్‌(Allu arjun). 69వ జాతీయ చలనచిత్ర లో ఉత్తమ నటుడిగా ఐకాన్‌ స్టార్‌ అర్జున్‌ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. 91 ఏళ్ల తెలుగు చిత్ర చరిత్రలో ఏ నటుడు సాధించన ఘనతను బన్నీ సాధించారు. ఈ సందర్భంగా తాజాగా అల్ల్లు అర్జున్‌ను అభిమానులు అభినందిస్తూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఒక లేఖ విడుదల చేశారు.

‘డియర్‌ అల్లు అర్జున్‌, మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ‘పుష్ప’ చిత్రంలో మీ నటన అద్భుతం. అందుకే దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు మిమ్మల్ని వరించింది. అంకితభావంతో మీరు చేసిన నటన తెరపై కనిపించింది. ఈ సంతోష సమయంలో మీకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అవార్డు వెనుక మీ కృషి ఎంతో ఉంది. ఈ అవార్డుకు మీరు అర్హులు. మీరు సాధించిన విజయం మీ ఫ్యాన్స్‌, శ్రేయోభిలాషులకు ఎనలేని గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గొప్ప పేరును తీసుకొచ్చారు. మీరు సాధించిన విజయం మన తెలుగు పరిశ్రమలో సమర్థతకు కొత్త నిదర్శనం. ఈ విజయంతో ఇతర తెలుగు నటీనటులకు జాతీయ వేదికపై అలాంటి గుర్తింపు కోసం ఆకాంక్షించేలా మీరు నిరూపించారు. ఈ ఆనంద సమయంలో నేను ఇండియాలో లేను. ఆ కారణంగా మీకు వ్యక్తిగతంగా అభినందనలు తెలిజేయలేకపోయాను. సెప్టెంబర్‌ 17వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాను. మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకుంటాను అని తెలియజేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. విష్ణు పంపిన లేఖపై అల్లు అర్జున్‌ స్పందించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, మంచు విష్ణుకు బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు. మంచు విష్ణు తెలిపిన ప్రశంసలు తన మనసును హత్తుకున్నాయన్నాయని బన్నీ అన్నారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుసుకుందామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T12:43:20+05:30 IST