సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Manoj: ‘చాలా రోజులుగా ఆ విషయాన్ని గుండెల్లోనే దాచుకున్నా’

ABN, First Publish Date - 2023-01-18T13:29:54+05:30

సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు మంచు మనోజ్

Manchu Manoj
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా ఆయన నటించిన కొత్త సినిమా ఏది తెర మీదకి రాలేదు. తాజాగా మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వార్త (Special news)ను తెలియజేస్తానని మనోజ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు.

మనోజ్ పోస్ట్ చేసిన ట్వీట్‌లో.. తన మొదటి చిత్రం ‘దొంగ దొంగది’లోని ‘మన్మథ రాజా’ పాటకు సంబంధించిన జిఫ్‌ వీడియో షేర్‌ చేశాడు. దానికి.. ‘నా హృదయానికి హత్తుకునే ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకొన్నాను. జీవితంలోని మరో దశలోకి అడుగు పెట్టేందుకు చాలా ఆతృతగా ఉన్నాను. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటిలానే మీ అందరీ ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘అన్నా.. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?’, ‘కొత్త సినిమా గురించి చెబుతావా?’, ‘నీ సినిమా వచ్చి చాలా రోజులైంది. త్వరగా కొత్త మూవీని రిలీజ్ చెయ్యి అన్న’ అంటూ వరుసగా కామెంట్స్ రాసుకొస్తున్నారు. అయితే అది పెళ్లి గురించా లేక సినిమా గురించా అనేది చూడాలి మరి.

Updated Date - 2023-01-18T13:29:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!