Pavitra - Naresh: మళ్లీ పెళ్లి కొత్త అప్‌డేట్‌ వచ్చింది!

ABN , First Publish Date - 2023-06-20T11:08:02+05:30 IST

మే నెల మొత్తం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యారు నరేశ్‌- పవిత్రా (Pavitra -Naresh) లోకేష్‌. అందుకు కారణం వారి వ్యక్తిగత కారణాలు, ఇద్దరూ కలిసిన నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా. ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం ఇద్దరూ విపరీతంగా హల్‌చల్‌ చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసిన నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli) చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

Pavitra - Naresh: మళ్లీ పెళ్లి కొత్త అప్‌డేట్‌ వచ్చింది!

మే నెల మొత్తం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యారు నరేశ్‌- పవిత్రా (Pavitra -Naresh) లోకేష్‌. అందుకు కారణం వారి వ్యక్తిగత కారణాలు, ఇద్దరూ కలిసిన నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా. ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం ఇద్దరూ విపరీతంగా హల్‌చల్‌ చేశారు. సినిమాతోపాటు వీరిద్దరి మధ్య ఉన్న బంధం, పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్‌ అయ్యారు. అలాగే ట్రోల్‌ కూడా అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసిన నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli) చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో వీరిద్దరి హవా మొదలైంది. సీనియర్‌ దర్శకనిర్మాత ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ వినూత్నంగా ప్రమోట్‌ చేసిన ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. (OTT Release on 23 june)

ప్రముఖ నటుడైన నరేందర్‌ (నరేశ్‌), సౌమ్య ేసతుపతి (వనిత విజయ్‌కుమార్‌) వివాహ బంధంతో ఒక్కటై ఓ బిడ్డకి జన్మనిచ్చాక... కాపురంలో కొన్ని కలహాలు మొదలవుతాయి. ఆ సమస్యలతో సతమతమవుతున్న నరేందర్‌ ప్రశాంతత కావాలనుకుంటాడు. అదే సమయంలో అతని జీవితంలోకి మరో నటి అయిన పార్వతి (పవిత్ర లోకేశ్‌) వస్తుంది. ఆమె నరేందర్‌కు ఎలా తారసపడింది. తర్వాత ఏం జరిగింది. ఆమె జీవితం వెనక సంఘర్షణ ఎలాంటిది? నరేందర్‌ ఏం చేశాడనేది సినిమా ఇతివృత్తం. గత నెల 26న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది.

Updated Date - 2023-06-20T11:08:02+05:30 IST