సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సార్‌ లాంటి సినిమా తీయడం ఆషామాషీ కాదు

ABN, First Publish Date - 2023-02-22T00:30:05+05:30

‘ఒక మంచి చిత్రాన్ని, గొప్ప సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఇలాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు. దానికి గుండె ధైర్యం కావాలి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఒక మంచి చిత్రాన్ని, గొప్ప సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఇలాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్‌ ఫిల్మ్‌ కాదు, కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదు.. రెండూ. అలా మాయ చేశాడు దర్శకుడు వెంకీ’ అని అభినందించారు ప్రజా నటుడు ఆర్‌.నారాయణమూర్తి. తమిళ హీరో ధనుష్‌ నటించిన తొలి తెలుగు చిత్రం ‘సార్‌’ సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఇలాంటి సినిమా తీసి హిట్‌ కొట్టిన నాగవంశీకి నా అభినందనలు. ఇది స్టూడెంట్స్‌ సినిమా, పేరెంట్స్‌ చిత్రం . జీవితంలో గుర్తుండిపోయే సినిమా . విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. ప్రైవేట్‌ సెక్టార్‌ వద్దు. పబ్లిక్‌ సెక్టార్‌ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన ఈ చిత్రానికి హ్యాట్సాఫ్‌’ అన్నారు నారాయణమూర్తి. తక్కువ రోజులే పని చేసినా ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని నటుడు సుమంత్‌ చెప్పారు. ‘మా చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు హీరోయిన్‌ సంయుక్త. ప్రతి స్టూడెంట్‌, టీచర్‌, పేరెంట్‌ చూడాల్సిన సినిమా ఇదని సాయికుమార్‌ చెప్పారు. ‘తల్లితండ్రులు జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అర్ధవంతమైన, సంస్కారవంతమైన కల కన్నాడు. దానిని ప్రేక్షకులు సాకారం చేశారు. ధనుష్‌ గొప్ప దర్శకుడు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటాడు’ అన్నారు తనికెళ్ల భరణి. ‘దిగువ మధ్యతరగతి కుటుంబాల బాధను తెలిపే సినిమా ఇది. ఈ చిత్రం చూసినప్పుడు నా తల్లితండ్రులు, టీచర్స్‌ గుర్తొచ్చారు’ అన్నారు సముద్రఖని. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు వెంకీ. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, హైపర్‌ ఆది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T00:30:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!