Preetisheel singh : అంత అనుభవం ఉన్నా.. ‘పుష్ప’ అంటే భయపడ్డా!

ABN , First Publish Date - 2023-09-10T11:10:02+05:30 IST

పుష్ప, గంగూబాయి, మిమి... ఈ మూడు పాత్రలకీ ఈసారి జాతీయ ఉత్తమ నటుడు, నటిగా అవార్డులు దక్కాయి. వి‘చిత్ర’ంగా ఈ మూడు పాత్రలను తీర్చిదిద్దింది ఒక్కరే. అల్లు అర్జున్‌, అలియాభట్‌, కృతిసనన్‌లను ఆయా పాత్రల్లోకి తన మేకప్‌ స్కిల్స్‌తో పరకాయ ప్రవేశం చేయించింది ఎవరో కాదు... ప్రముఖ రూపశిల్పి ప్రీతీషీల్‌ సింగ్‌

Preetisheel singh : అంత అనుభవం ఉన్నా.. ‘పుష్ప’ అంటే భయపడ్డా!

పుష్ప(Pushpa), గంగూబాయి, మిమి... ఈ మూడు పాత్రలకీ ఈసారి జాతీయ ఉత్తమ నటుడు, నటిగా అవార్డులు దక్కాయి. వి‘చిత్ర’ంగా ఈ మూడు పాత్రలను తీర్చిదిద్దింది ఒక్కరే. అల్లు అర్జున్‌, అలియాభట్‌, కృతిసనన్‌లను ఆయా పాత్రల్లోకి తన మేకప్‌ స్కిల్స్‌తో పరకాయ ప్రవేశం చేయించింది ఎవరో కాదు... ప్రముఖ రూపశిల్పి ప్రీతీషీల్‌ సింగ్‌(Preetisheel singh). ఆమె కూడా ‘జాతీయ ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌’గా ఎంపికైంది. సినిమాల్లో ఎలాంటి లుక్కైనా ‘తగ్గేదేలే’ అంటున్న ఈ మేకప్‌ క్వీన్‌ చెబుతున్న కబుర్లివి...

సాఫ్ట్‌వేర్‌ టూ మేకప్‌... (Preetisheel singh)

నేను పుట్టి పెరిగిందంతా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో. చిన్నప్పటి నుంచి ఫాంటసీ సినిమాలంటే పిచ్చి. కానీ మొదట చదువు మీద దృష్టి పెట్టాలనుకున్నా. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశా. కానీ నా మనసంతా సినిమాల మీదే ఉండేది. దాంతో ఉద్యోగం మానేసి, మేకప్‌ మెళకువలు నేర్చుకునేందుకు లాస్‌ఏంజిల్స్‌లోని మేకప్‌ స్కూల్‌లో చేరా. ప్రోస్థటిక్‌ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించా. ఇండియాకు తిరిగొచ్చి భర్త మార్క్‌ డిసౌజాతో కలసి ముంబాయిలో ‘డా మేకప్‌ ల్యాబ్‌’ పేరుతో మేకప్‌ స్టూడియో ప్రారంభించా.

Pushpa.jpeg

త్రీ ఛీర్స్‌(Sanjay Leela bhansali)

ఒకరకంగా నాదీ సంజయ్‌ లీలా భన్సాలీది క్రేజీ కాంబినేషన్‌. ఆయనతో చేసిన మూడు సినిమాలూ సూపర్‌ హిట్సే. ‘బాజీరావు మస్తానీ’లో దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, రణవీర్‌సింగ్‌ లుక్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. నా పనితనం నచ్చి ‘పద్మావత్‌’లో అవకాశం ఇచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన పీరియాడిక్‌ చిత్రం అది. రిఫరెన్స్‌ తీసుకుందామంటే ఆ యుగానికి సంబంధించినవి ఏవీ లేవు. అయినప్పటికీ అందులోని పాత్రలకు నా వంతు న్యాయం చేశా. రణవీర్‌ సింగ్‌ పోషించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ లుక్‌ నాకు గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ‘గంగూబాయి కఠియావాడి’లో అలియాభట్‌ లుక్‌కి దక్కిన ప్రశంసల గురించి ఎంత చెప్పినా తక్కువే.

పాత్రకు తగ్గట్టుగా...

యుక్త వయసులో ఉన్న వారిని ముసలివాళ్లుగా, సన్నగా ఉన్నవారిని లావుగా, క్లాస్‌గా ఉన్న వారిని మాస్‌గా... ఇలా పాత్రను రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తా. ఇల్యూజన్‌ ఫేస్‌ డిజైన్స్‌ వెయ్యడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ క్లైమాక్స్‌లో సాయిపల్లవిని వృద్ధురాలిగా, ‘పుష్ప’లో రష్మికను గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిలా, ‘మిమి’లో కృతిసనన్‌ని గర్భవతిగా.. ఇలా ఆయా పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను తీర్చిదిద్దుతా. కేవలం సినిమాలే కాదు... ప్రకటనలకూ హెయిర్‌, మేకప్‌, ప్రోస్థటిక్‌ మేకప్‌ ఆర్టిస్టుగా సేవలందించా.

National.jpeg

ఆ సినిమా ప్రభావమే!(Kamal Haasan)

నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో కమల్‌హాసన్‌ ‘చాచీ 420’ ఒకటి. ఒకరకంగా నేను ఈ రంగంవైపు రావడానికి నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా అది. సినిమాల్లోకి వచ్చాక... నాకు సవాలు విసిరిన పాత్రంటే.. ‘పిఎమ్‌ నరేంద్రమోదీ’లో వివేక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్ర. ఒబెరాయ్‌ని అచ్చంగా నరేంద్రమోదీలా చూపించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. కానీ చివరికి అనుకున్నది సాధించా.

అలా.. పుష్పరాజ్‌తో...

సుకుమార్‌ సార్‌ మొదట ‘పుష్ప’ కథ చెప్పినప్పుడు కాస్త ఒత్తిడికి గురయ్యా. ఎందుకంటే అల్లు అర్జున్‌ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. వారి అంచనాలకు తగ్గట్టు కొత్త లుక్‌లో చూపించాలనుకున్నా. మేకప్‌కు రెండు మూడు గంటలు పట్టేది. పాత్ర పట్ల తనకున్న అంకిత భావాన్ని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు. అల్లు అర్జున్‌తో పనిచేయడం ఒక అద్భుతం.

WhatsApp Image 2023-09-10 at 10.53.15 AM.jpeg

జాతీయ స్థాయిలో గుర్తింపు

సక్సెస్‌ అంత సులువుగా ఏం రాలేదు. తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. కొంతకాలానికి ‘నానక్‌ షా ఫకీర్‌’ సినిమా రూపంలో అవకాశం తలుపు తట్టింది. నన్ను నేను నిరూపించుకునేందుకు ఎక్కువ కష్టపడ్డా. కట్‌ చేస్తే... తొలి సినిమాకే జాతీయ అవార్డు వరించింది. ఇక ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Updated Date - 2023-09-10T11:10:02+05:30 IST