Mahesh Viral: మహేశ్‌... గ్రీకువీరుడు.. రాకుమారుడు

ABN , First Publish Date - 2023-04-06T19:40:49+05:30 IST

మహేశ్‌బాబు(Maheshbabu) అందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన అందం పెరుగుతోంది. కానీ తగ్గడం లేదు.

Mahesh Viral: మహేశ్‌... గ్రీకువీరుడు.. రాకుమారుడు

మహేశ్‌బాబు(Maheshbabu) అందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన అందం పెరుగుతోంది. కానీ తగ్గడం లేదు. అమ్మాయిల పాలిట కలల రాకుమారుడు ఆయన. తాజాగా మహేశ్‌బాబు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి(Maheshbabu photos viral). గురువారం బయటకు వచ్చిన ఈ ఫొటోలే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఓ బ్రాండ్‌ కోసం యాడ్‌ షూట్‌ చేశారు మహేశ్‌. దానికి సంబంధించిన ఫొటోల్లో మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపించారు మహేశ్‌. దీంతో నెటిజన్లు, అభివనులుఉ ‘ఏ కాలేజ్‌ అన్నా?’ ‘ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌లా ఉన్నావ్‌’, ‘గ్రీకువీరుడు- రాకుమారుడు’ (Greeku veerudu- Raakumarudu) అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. (SSMB28)

మహేశ్‌ ప్రస్తుతం తివిక్రమ్‌ (Trivikram)దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉందీ చిత్రం. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. పూజాహెగ్డే హీరోయిన్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంతో తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వంచర్‌ మూవీ చేయబోతున్నారు మహేశ్‌. (SSMB29)

Updated Date - 2023-04-06T19:47:01+05:30 IST