MaheshBabu: దుబాయ్‌ టూర్‌.. ఎందుకంటే..

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:46 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Maheshbabu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ (Guntur karam) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే! సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

MaheshBabu: దుబాయ్‌ టూర్‌.. ఎందుకంటే..

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Maheshbabu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ (Guntur karam) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే! సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. తన పార్ట్‌ షూటింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహేష్  చిన్న వెకేషన్  కోసం దుబాయ్‌ పయనమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ బయలుదేశారు. ఎయిర్‌ పోర్ట్‌లో వెళ్తున్న మహేష్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ బాబు చేయి పట్టుకుని సితార నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్‌ వెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెకేషనతోపాటు ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం దుబాయ్‌ వెళ్తున్నారని మహేశ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. (mahesh dubai tour)

మహేష్‌, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ుగుంటూరు కారం’ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. శుక్రవారం ఈ చిత్రంలోని ుకుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే మాస్‌ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది. ఈ చిత్రానికి తమన సంగీత దర్శకుడు.

Updated Date - Dec 29 , 2023 | 03:46 PM