Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ షోకు మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్‌

ABN , First Publish Date - 2023-12-13T12:31:14+05:30 IST

అన్‌స్టాప‌బుల్ 3 మ‌రో ఏపిసోడ్‌కు సిద్ధ‌మైంది. బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా గ‌త రెండు సీజ‌న్‌లుగా వ‌చ్చిన అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత పేరుందో అంద‌రికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ షోలో మ‌హేశ్‌బాబు, త్రివిక్ర‌మ్ పాల్గొనబోతున్న‌ర‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ షోకు మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్‌
Mahesh, Trivikram NBK

అన్‌స్టాప‌బుల్ 3(Unstoppable ) మ‌రో ఏపిసోడ్‌కు సిద్ధ‌మైంది. బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా గ‌త రెండు సీజ‌న్‌లుగా వ‌చ్చిన అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత పేరుందో అంద‌రికీ తెలిసిందే. ప్రారంభించిన కొద్దికాలంలోనే ఎక్కువ‌మంది చూసే షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎంతోమంది సెల‌బ్రిటీల‌తో షో నిర్వ‌హించిన బాల‌కృష్ణ (Balakrishna) వారితో క‌లిసిపోయి ఆడి పాడారు, ఆట ప‌ట్టించారు. త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు అడుగుతూ అవ‌త‌లి వారితో జ‌వాబులు రాబ‌ట్టేవారు.

ఇటీవ‌లే త‌ను హీరోగా న‌టించిన‌ భ‌గ‌వంత్ కేస‌రి సినిమా విడుద‌ల సంద‌ర్భంగా అన్‌స్టాప‌బుల్ 3వ సీజ‌న్‌ను ప్రారంభించి లిమిటెడ్ ఏపిసోడ్స్‌తో ముగిస్తామ‌ని చెప్పారు. ఈక్ర‌మంలోనే భ‌గ‌వంత్ కేస‌రిలో న‌టించిన కాజ‌ల్‌, శ్రీలీల‌, ద‌ర్శ‌కుడు అనీల్ రావిపుడితో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి టెలీకాస్ట్ చేశారు. మ‌ళ్లీ కాస్త విరామం త‌ర్వాత యానిమ‌ల్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా, ర‌ణ‌బీర్ క‌పూర్, ర‌ష్మిక‌ల‌తో క‌లిసి ఓ ప్రోగ్రామ్‌ను విడుద‌ల చేయ‌గా వీట‌న్నింటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మాల్లో బాల‌కృష్ణ (Balakrishna) గెస్ట్స్‌తో చేసిన సంద‌డి ఓ రేంజ్‌లో పేలింది. ఆ సినిమాల స‌క్సెస్‌కు కూడా ఉప‌యోగ‌ ప‌డింది.


అయితే తాజాగా ఈ అన్‌స్టాప‌బుల్ షో 3వ ఎపిసోడ్‌లోలో పాల్గొనేందుకు మ‌హేశ్‌బాబు, త్రివిక్ర‌మ్ రెడీ అవుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీరి కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌స్తున్న‌ గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా 2024 జ‌న‌వ‌రి 12న‌ సంక్రాంతి పండుగ రోజున‌ విడుద‌లకు సిద్ధ‌మైంది. ఈక్ర‌మంలోనే షోలో పాల్గొని చిత్రం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించాల‌నే యోచ‌న‌లో మేక‌ర్స్‌ ఉన్న‌ట్లు స‌మాచారం. అన్‌స్టాప‌బుల్ మొద‌టి భాగంలో చివ‌రి కంటెస్టెంట్‌గా మ‌హేశ్‌బాబు, వంశీ పైడిప‌ల్లి పాల్గొన‌గా ఇప్పుడు మ‌రోసారి తివిక్ర‌మ్ (Trivikram)తో క‌లిసి పాల్గొన‌నుండ‌డంతో ఇప్పుడు ఈ షోపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇదిలాఉండ‌గా బాలకృష్ణ (Balakrishna) ప్ర‌స్తుతం బాబీ డైరెక్ష‌న్‌లో 109 సినిమా షూటింగ్ నిమిత్తం ఊటీలో ఉండ‌గా, మ‌హేశ్‌బాబు (MaheshBabu) మ‌రో వారంలో గుంటూరు కారం షూటింగ్‌కు పాక‌ప్ చెప్పి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం విదేశాల‌కు వెళ్ల‌నున్నారు. ఈ గ్యాప్‌లోనే అన్‌స్టాప‌బుల్ (Unstoppable) షూట్‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి రెండో వారంలో ఈ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నట్లు స‌మాచారం. కాగా ఇప్ప‌టికే గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా నుంచి విడుద‌ల చేసిన లుక్స్‌, పాట‌లు చిత్రంపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

Updated Date - 2023-12-13T13:09:33+05:30 IST