Mahesh Babu: సాటర్‌డే సిజిల్‌ సెట్‌... కష్టం మామూలుగా లేదుగా..

ABN , First Publish Date - 2023-07-02T11:13:37+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నా మహేశ్‌ వర్కవుట్స్‌ను మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. జిమ్‌లో హెవీ వర్కవుట్స్‌ చేస్తూ క్యాలరీలను కరిగిస్తున్నారు.

Mahesh Babu: సాటర్‌డే సిజిల్‌ సెట్‌... కష్టం మామూలుగా లేదుగా..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ (mahesh babu) ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ (Guntur karam)చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నా మహేశ్‌ వర్కవుట్స్‌ను మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. జిమ్‌లో హెవీ వర్కవుట్స్‌ (heavy Workouts) చేస్తూ క్యాలరీలను కరిగిస్తున్నారు. ఆ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. జిమ్‌లో తనకు బాగా ఇష్టమైన మూడు రకాల వర్కవుట్స్‌ చేస్తూ కనిపించారు. ఇవే నాకు బాగా ఇష్టమైన వర్కవుట్స్‌ అంటూ పోస్ట్‌ చేశారు. ‘మై సాటర్‌ డే సిజిల్‌ సెట్‌’ (Saturday Sizzle Set) అంటూ ఒక నిమిషం ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌, ఒక నిమిషం కెటిల్‌బెల్‌ స్వింగ్‌, ఒక నిమిషం స్కిల్‌మిల్‌ రన్‌ చేస్తూ.. మీరు ఎన్ని సెట్లు చేయగలరు? అంటూ చాలెంజ్‌ విసిరారు. ఆ పోస్ట్‌ గమనించిన మహేశ్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ ఫైర్‌ ఎమోజీలతో కామెంట్‌ చేశారు. మహేశ్‌ ఫ్యాన్స్‌ అయితే ‘పోకిరి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Untitled-2.jpg

పలు కారణాలతో కొంత విరామం తర్వాత షూటింగ్‌ మొదలైన ‘గుంటూరు కారం’ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తదుపరి మహేశ్‌ రాజమౌళి చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’తో (SSMB29)బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్ర్కిప్ట్‌ పనులు పూర్తయ్యాయని కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ చెప్పిన విషయం తెలిసిందే!

Updated Date - 2023-07-02T11:32:49+05:30 IST