scorecardresearch

Mahesh Babu: ఎంతో ప్రత్యేకం... ట్వీట్‌ వైరల్‌!

ABN , First Publish Date - 2023-05-31T10:44:58+05:30 IST

సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌లో ఒకటైన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె ఫార్మట్‌లో బుధవారం విడుదల చేయనున్నారు. ఆ సినిమా ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్స్‌లోరూ మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ టైటిల్‌ను ‘మాస్‌ స్టైక్‌’ పేరుతో అభిమానుల చేత విడుదల చేయనున్నారు.

Mahesh Babu: ఎంతో ప్రత్యేకం... ట్వీట్‌ వైరల్‌!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనున్నారు. మే 31, బుధవారం ఆయన తండ్రి కృష్ణ జయంతిని (Krishna Jayanthi) పురస్కరించుకుని మహేశ్‌ నటిస్తున్న చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. అది కూడా ఎంతో ప్రత్యేకంగా. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌లో ఒకటైన ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku mosagadu)చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె ఫార్మట్‌లో బుధవారం విడుదల చేయనున్నారు. ఆ సినిమా ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్స్‌లోరూ మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ (SSMB28 First look) టైటిల్‌ను ‘మాస్‌ స్టైక్‌’ పేరుతో అభిమానుల చేత విడుదల చేయనున్నారు. దీనిపై మహేశ్‌ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. (Mahesh Tweet) ‘‘ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఇది మీ కోసమే నాన్న’’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ప్రతి ఏడాది కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని మహేశ్‌ నటించిన సినిమాకు సంబంధించిన ఏదో ఒక సర్‌ప్రైజ్‌, లుక్‌, సాంగ్‌, టైటిల్‌ ఇలా ఏదో ఒకటి విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కృష్ణలేరు. అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహేశ్‌బాబు తన తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ చిత్రం టైటిల్‌ను విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తున్న చిత్రమిది. హారిక - హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్‌ ఏంటనేది తెలియాలంటే నేటి సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే! ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీలా కథానాయికలు.

Updated Date - 2023-05-31T11:54:10+05:30 IST