SSMB28: నాన్న అభిమానులకు మహేష్ కానుక, కృష్ణ పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్

ABN , First Publish Date - 2023-05-16T17:27:39+05:30 IST

తన తండ్రి కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 న, మహేష్ బాబు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది. అదేంటో తెలుసా...

SSMB28: నాన్న అభిమానులకు మహేష్ కానుక, కృష్ణ పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్
Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ (SupserStarKrishna) పుట్టినరోజు అయిన మే 31 (May 31) న మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా #SSMB28 నుండి ఒక చిన్న వీడియో, అలాగే ఆ సినిమా టైటిల్ కూడా ప్రకటిస్తారు. ఈ సినిమా కోసం చాలా రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయి కానీ, ఇంతవరకు ఏదీ కన్ఫర్మ్ కాలేదు అని తెలిసింది. వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు రేపు అంటే మే 17న (May17) మళ్ళీ హైదరాబాద్ (Hyderabad) వస్తున్నట్టు తెలిసింది. మహేష్ బాబు వచ్చాక, అతనికి తీసుకెళ్లి చూపించి టైటిల్ ఒకటి ఫైనలైజ్ చేస్తారు అని కూడా తెలిసింది.

mahesh.jpg

మే 31న ఉంటుంది ఈ హంగామా అంతా. అయితే తన తండ్రి కృష్ణ అభిమానులకి (KrishnaFans) ఏదైనా చెయ్యాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది. అందుకే అతను దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ (SitharaEntertainments) తో మాట్లాడి ఆరోజు ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పాడట. అదే రోజు కృష్ణ కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకు మోసగాడు' (MosagallakuMosagadu) కూడా విడుదల అవుతోంది. #MosagallakuMosagaduOnMay31 ఆ సినిమా భారత దేశం లో మొదటి కౌబాయ్ సినిమా.

mosagallakumosagadu.jpg

అందువలన, మహేష్, త్రివిక్రమ్ సినిమా నుండి వచ్చే ఆ చిన్న వీడియో ఆన్ లైన్ లో కాకుండా, కృష్ణ సినిమా విడుదల అయిన థియేటర్స్ అన్నింటిలో ఆ సినిమాతో పాటు ప్రదర్శిస్తే బాగుంటుంది అని ఒక సలహా రావటంతో అది బాగుందని అన్నాడని తెలిసింది. ఇప్పుడు ఈ చిత్ర నిర్వాహకులు ఆ చిన్న వీడియో, టైటిల్ ప్రకటనని 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాకి అటాచ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ముందు అభిమానులకు థియేటర్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా ఆ చిన్న వీడియోని చూసే అవకాశం లభిస్తుంది. తరువాత ఆన్ లైన్ లో పెట్టాలని కూడా యోచిస్తున్నారు. 'గుంటూరు కారం', 'అమరావతికి అటు ఇటు', 'వూరికి మొనగాడు' లాంటి టైటిల్ ఉండొచ్చు అని సాంఘీక మాధ్యమం లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-05-16T17:43:31+05:30 IST