సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh Babu: అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా?

ABN, First Publish Date - 2023-06-06T13:18:25+05:30

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సందడి చేశారు. పార్టీలకు దూరంగా ఉండే ఆయన భార్యతో నమ్రతతో కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. ఆ ఫొటోలనే ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే జనరల్‌గా ఆయన ఏదైనా కార్యక్రమానికి అటెండ్‌ అయితే వాటి గురించి ఎప్పుడూ పెద్ద ప్రస్తావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh babu) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సందడి చేశారు. పార్టీలకు దూరంగా ఉండే ఆయన భార్యతో నమ్రతతో (namratha)కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. ఆ ఫొటోలనే ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే జనరల్‌గా ఆయన ఏదైనా కార్యక్రమానికి అటెండ్‌ అయితే వాటి గురించి ఎప్పుడూ పెద్ద ప్రస్తావించారు. ఫ్యామిలీ ట్రిప్‌లు, పిల్లలు, సినిమాలకు సంబంధించిన విషయాలనే ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఓ ఈవెంట్‌కు తన భార్య నమత్రతో కలిసి వెళ్లిన ఆయన సంబంధిత ఫొటోలను షేర్‌ చేసి చాలా ఎంజాయ్‌ చేసినట్లు ‘ఫుల్‌ ఫన్‌ నైట్‌’ (Full fun time) అని పేర్కొన్నారు. అంతకు మించి వివరాలేమీ చెప్పలేదు. అయితే ఆ ఫొటోలో మహేశ్‌ లుక్‌ (Mahesh New look Viral) మాత్రం అభిమానుల్ని, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రేయా భూపాల్‌ బేబీషవర్‌ (Shreya Bhupal Baby shower) కార్యక్రమంలో మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌ పాల్గొని సందడి చేశారు. మహేశ్‌ స్వయంగా అక్కడ సెల్ఫీ తీశారు. ఆ ఫొటోలను వీక్షించిన అభిమానులు ‘సో క్యూట్‌, సూపర్‌ అన్నా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘మహేశ్‌ నువ్వింకా 20 లోనే ఉన్నారు. నవ్వు చాలా బావుంది. మీరు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా?’ అంటూ మరికొందరు అంటూ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-06-06T13:18:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!