సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SSMB28: మహేష్ బాబు షూటింగ్ నిరవధికంగా వాయిదా.... ఇంతకీ ఏమైందంటే...

ABN, First Publish Date - 2023-04-23T12:41:58+05:30

మహేష్ బాబు వెకేషన్ నుండి వచ్చాక సినిమా షూటింగ్ మొదలెడతామని నిర్మాత, దర్శకుడు సమాయత్తం అవుతున్న సమయంలో షూటింగ్ నిరవధికంగా వాయిదా అనే మాట వచ్చింది. ఇంతకీ ఏమైంది ఎందుకు ఇన్నిసార్లు వాయిదా అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. ఈ సినిమా మొదలయిన దగ్గర నుండీ ఈ సినిమాకి కష్టాలు తప్పటం లేదు. గత సంవత్సరం షూటింగ్ మొదలెట్టారు, కానీ మహేష్ బాబు తల్లి గారు, తరువాత కృష్ణ (SuperStarKrishna) గారు పరమపదించటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆ తరువాత మహేష్ వెకేషన్ (Vacation) అంటూ విదేశాలకు వెళ్లి మధ్యలో చాలాసార్లు బ్రేక్ తీసుకోవటం కూడా జరిగింది. అసలు ఈ సినిమా మీద ఎవరికయినా ఆసక్తికరంగా ఉందా అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ముందు అనుకున్నట్టుగా అయితే ఈ సినిమా ఈ సంవత్సరం లోనే విడుదల కావలసి వుంది. కానీ ఇలా అవాంతరాలు రావటం, షూటింగ్ జరగకపోవటం వలన, ఈ సినిమా ఇప్పుడు వచ్చే సంవత్సరం సంక్రాంతికి (Sankranthi release) విడుదల అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది కూడా పోస్టుపోన్ అయ్యే అవకాశం వుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ఈ సినిమాకి నిర్మాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) నాగవంశీ (Suryadevara Naga Vamsi). ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ జరగాల్సి ఉండగా, మహేష్ బాబు (MaheshBabu) వెకేషన్ వెళ్ళిపోయాడు. వచ్చాక మొదలవుతుంది అని అనుకుంటే, మహేష్ బాబు నిర్మాతకి తనకి షూటింగ్ చేసే మూడ్ లో లేను అని చెప్పి వచ్చే నెలలో చేద్దాం అని చెప్పినట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అంటే #SSMB28 మహేష్ బాబు కి కూడా ఈ సినిమా షూటింగ్ తాపీగా చేద్దాం అనే చూస్తున్నాడు. ఇలా షూటింగ్ వాయిదాలు పడటం, లాంగ్ బ్రేక్ లు తీసుకోవటం తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా #SSMB28 మీద అంత ఇంటరెస్ట్ చూపించటం లేదు అని టాక్ నడుస్తోంది.

అతను పవన్ కళ్యాణ్ తో ఎక్కువ కాలం గడుపుతూ అతని సినిమాల స్క్రిప్ట్ లు చూస్తూ వాటికీ సలహాలు ఇస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఈ లెక్కన ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలెడతారు, ఎప్పుడు విడుదల చేస్తారు, అని మహేష్ అభిమానులు ఒక పక్క ఆందోళనగా వున్నారు. ఇందులో పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) కథానాయకురాలుగా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, చాలామంది క్యారెక్టర్ నటులు ఇందులో వున్నట్టుగా తెలిసింది. మహేష్ తదుపరి సినిమా #SSMB29 రాజమౌళి (Rajamouli) తో చేయాల్సి వుంది. ఒకవేళ అది కూడా ఈ సంవత్సరం మొదలెడితే ఈ సినిమా సంగతి ఏంటో మరి అని పరిశ్రమలో అంటున్నారు.

Updated Date - 2023-04-23T12:41:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!