Mahesh Babu: నమ్రతకి మీరు బట్టలు కొంటారా అని మహేష్ ని అడిగితే, షాకింగ్ సమాధానం...

ABN , First Publish Date - 2023-10-16T11:53:24+05:30 IST

మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ ఒకేసారి మీడియా ముందుకు రావటం మొదటి సారిగా ఈరోజు జరిగింది. తమ స్నేహితుల షాపు ఓపెనింగ్ కి వచ్చిన ఇద్దరూ తమ స్వంత విషయాల గురించి కొన్ని నిముషాలపాటు మీడియాతో మాట్లాడేరు.

Mahesh Babu: నమ్రతకి మీరు బట్టలు కొంటారా అని మహేష్ ని అడిగితే, షాకింగ్ సమాధానం...
Tollywood power couple Mahesh Babu and Nramrata appeared first time in front of media

మహేష్ బాబు (MaheshBabu), అతని భార్య నమ్రత (Namrata) ఇద్దరూ ఎప్పుడైనా ఒకేసారి మీడియా ముందుకు రావటం మొదటి సారిగా ఈరోజు జరిగింది. జూబిలీ హిల్స్ లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి ఇద్దరూ కలిసి రావటం ఇదే మొదటి సారి. ఆ విషయం స్వయంగా మహేష్ బాబు చెప్పారు. నేను ఈరోజు మహేష్ ని కూడా రమ్మని చెప్పి అతన్ని కూడా ఇలా ఈ ఫంక్షన్ కి ఈరోజు తీసుకు వచ్చాను అని చెప్పారు నమ్రత.

ఈ సంర్భంగా మాట్లాడుతూ నమ్రత కి ఎప్పుడైనా మీరు ఏమైనా బట్టలు కొన్నారా అంటే, మహేష్ బాబు ఏమని సమాధానం ఇస్తారో అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటే, అతను షాకింగ్ సమాధానం ఇచ్చారు. "లేదు, నేను ఎప్పుడూ కొనలేదు. ఎందుకంటే నాకు అంతగా సెలక్షన్ రాదు. ఇంకా చెప్పాలంటే, నా బట్టలు కూడా నమ్రత నే షాపింగ్ చేస్తుంది. నేను చెయ్యను అన్నీ తనే చూస్తుంది," అని చెప్పారు మహేష్ బాబు.

maheshbabu-namrata1.jpg

అయితే ఇదేమి తన బ్రాండింగ్ లో పార్టు కాదని, కేవలం స్నేహితుల కోసం ఈ షాపు ఓపెనింగ్ కి వచ్చామని చెప్పారు. ఇక సినిమా విషయం చెప్పాలంటే మహేష్ బాబు 'గుంటూరు కారం' #GunturKaaram షూటింగ్ లో బిజీగా వున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఇందులో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కథానాయకులు, ప్రకాష్ రాజ్ (PrakashRaj), రమ్య కృష్ణ (RamyaKrishna), రావు రమేష్ (RaoRamesh), మురళి శర్మ, బ్రహ్మాజీ (Brahmaji) మున్నగు వారు నటిస్తున్నారు.

Updated Date - 2023-10-16T12:17:44+05:30 IST