మహారాజు వస్తున్నాడు
ABN, First Publish Date - 2023-07-14T23:03:24+05:30
హీరోగా, విలన్‌గా విభిన్న పాత్రల్లో తనదైన నటనతో భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి....
హీరోగా, విలన్‌గా విభిన్న పాత్రల్లో తనదైన నటనతో భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన నటిస్తున్న 50 చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి ‘మహారాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘కురంగు బొమ్మై’చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నితిలన్ సామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ అండ్ థింక్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దా్‌స, నట్టి నటరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దినే శ్ పురుషోత్తమన్.