నెలాఖరుకు మ్యాడ్
ABN , First Publish Date - 2023-09-02T00:11:44+05:30 IST
హారికా సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’. రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది.....

హారికా సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’. రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. ‘మ్యాడ్’ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. సాయిసౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి