Payal Ghosh: బాల‌య్య‌ను.. చూసి నేర్చుకోండి: జూ.ఎన్టీఆర్ భామ

ABN , First Publish Date - 2023-11-05T17:49:44+05:30 IST

బాల‌య్య ఎప్పుడూ టాక్ ఆఫ్‌ది న్యూసే.. ఇటీవ‌ల అఖండ‌, వీర‌సింహారెడ్డి, తాజాగా భ‌గవంత్ కేసరి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో మంచి జోరు మీదున్న బాల‌కృష్ణ‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బాలీవుడ్ భామ పాయ‌ల్ ఘోష్‌ చేసిన ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్‌గా మారింది.

Payal Ghosh: బాల‌య్య‌ను.. చూసి నేర్చుకోండి: జూ.ఎన్టీఆర్ భామ
Payal ghose

బాల‌య్య ఎప్పుడూ టాక్ ఆఫ్‌ది న్యూసే.. ఎప్పుడు ఎక్క‌డో ఓ చోట , ఏదో సంద‌ర్భంలో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేస్తాడు. ఒక్కోసారి త‌న డైలాగ్స్‌, చేష్ట‌ల‌తో అయితే మ‌రికొన్ని మార్లు త‌న ప్ర‌మేయం లేకుండానే వార్త‌ల్లో కెక్కేస్తాడు. అయితే ఇటీవ‌ల అఖండ‌ (Akhanda), వీర‌సింహారెడ్డి (VeeraSimha Reddy), తాజాగా భ‌గవంత్ కేసరి (Bhagavanth Kesari) బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో మంచి జోరు మీదున్న బాల‌కృష్ణ‌ (Balakrishna)ను ఆకాశానికి ఎత్తేస్తూ బాలీవుడ్ భామ పాయ‌ల్ ఘోష్‌ (payal ghosh) చేసిన ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్‌గా మారింది.

మంచు మ‌నోజ్, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప్ర‌యాణం సినిమా ద్వారా తెలుగునాట అడుగుపెట్టిన బెంగాలీ ముద్దుగుమ్మ‌ పాయ‌ల్ ఆ త‌ర్వాత జూ. ఎన్టీఆర్‌తో ఊస‌ర‌వెల్లి చిత్రం అనంత‌రం బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్క‌డ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసి ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) ప్రెసిడెంట్‌ రాందాస్‌ అథవాలేకు చెందిన రాజ‌కీయ‌ పార్టీలో చేరి మ‌హిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్న‌ది.


అయితే సోష‌ల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ త‌రుచూ తెలుగు న‌టుల పేర్లు తీస్తూ ఇత‌ర భాష‌లపై, అక్క‌డి న‌టుల‌పై కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో తాజాగా బాల‌కృష్ణ‌(Balakrishna) పేరును తెర మీద‌కు తీసుకువ‌చ్చి బాలీవుడ్‌పై విమ‌ర్శ‌లు చేసింది. ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న‌ వ‌రుసగా సూప‌ర్ హిట్ సినిమాలు చేస్తూ ఎదుటి వారికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడ‌ని ఆయ‌న‌ను చూసి బాలీవుడ్ న‌టులు చాలా నేర్చుకోవాలంటు కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసిన పోస్టు నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది.

Updated Date - 2023-11-05T18:03:10+05:30 IST