‘ఆపరేషన్ రావణ్’తో అదరగొడతాం
ABN, First Publish Date - 2023-06-01T00:30:10+05:30
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంకీర్తన విపిన్ కథానాయిక. వెంకట్ సత్య దర్శకత్వం వహించారు....
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంకీర్తన విపిన్ కథానాయిక. వెంకట్ సత్య దర్శకత్వం వహించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా బాగుంది. ఓ కొడుకు కోసం తండ్రి దర్శకుడు అవ్వడం ఇదే చూస్తున్నా. ‘మీ ఆలోచనలే మీ శత్రువులు’ అనే క్యాప్షన్ కూడా నాకు బాగా నచ్చింద’’న్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాధిక మాట్లాడుతూ ‘‘కొత్త పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. నాకు నచ్చిన పాత్ర వస్తే అన్ని పనులు మానుకొని మరీ సినిమాలు చేస్తాను. కష్టపడితే ఫలితం దక్కుతుందని నేను బలంగా నమ్ముతా. ఈ టీమ్ బాగా కష్టపడింది. వాళ్లకు తప్పకుండా మంచి ఫలితం వస్తుంద’’న్నారు. ‘‘పలాస నాకు చాలామంచి పేరు తీసుకొచ్చింది. ‘ఈ సినిమా నచ్చితే చూడండి.. నచ్చకపోతే కాలర్ పట్టుకోండి..’ అని ‘పలాస’ విడుదల రోజు ధైర్యంగా చెప్పా. నా నమ్మకాన్ని నిలబెడుతూ ‘పలాస’ బాగా ఆడింది. ఈ సినిమాకి అంతకంటే నమ్మకంగా ఉన్నా. ‘ఆపరేషన్ రావణ్’తో అదరగొడతాం. సినిమా అంత బాగా వచ్చింద’’న్నారు రక్షిత్.