Kushi - OTT : ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2023-09-24T12:58:13+05:30 IST

విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. అక్టోబర్‌ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కాబోతున్నట్లు ట్విట్టర్‌ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ప్రకటించింది.

Kushi - OTT : ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

విజయ దేవరకొండ(Vijay devarakonda), సమంత (samantha) జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’(Kushi) సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల ఒకటో తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. విజయ్‌, సమంతల ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ర్టీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ర్టీమింగ్‌కు సిద్థమైంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. అక్టోబర్‌ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కాబోతున్నట్లు ట్విట్టర్‌ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ప్రకటించింది. మొదట అక్టోబర్‌ ఆరో తేదిన ఓటీటీ రిలీజ్‌ అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే! నెట్‌ఫ్లిక్స్‌ క్లారిటీ అధికారికగాఆ ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. నిడివి కారణంగా కట్‌ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా ఓటీటీ కాపీలో యాడ్‌ చేశారట. విజయ్‌, సమంతలకు సంబంధించిన రొమాంటిక్స్‌ సీన్స్‌ ఓటీటీలో యాడ్‌ చేశారని తెలిసింది.

Updated Date - 2023-09-24T12:59:57+05:30 IST