Guntur karam: మ.. మ.. మహేష్‌ మామూలు మాస్‌ కాదు!

ABN , Publish Date - Dec 29 , 2023 | 11:54 AM

మహేష్‌బాబు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో  వస్తున్న చిత్రం 'గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో 'ఆ కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ గురించి చాలాకాలంగా వైరల్‌ అవుతోంది.

Guntur karam: మ.. మ.. మహేష్‌ మామూలు మాస్‌ కాదు!

మహేష్‌బాబు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో  వస్తున్న చిత్రం 'గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో 'ఆ కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ గురించి చాలాకాలంగా వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈలోపే అభిమానులకు కాస్త రుచి చూపించడం కోసం ఆ పాటకు సంబంధించిన ప్రోమోను వదిలారు. 

మహేష్‌బాబు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా విడుదల చేశారు. 26 సెకెన్ల నిడివి గల ఈ సాంగ్‌ ప్రొమో ఊర మాస్‌గా ఉంది. మహేష్‌ డాన్స్  నాటునాటుగా ఉంది. ఇక శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  మాస్సీ స్టెప్పులతో ఇరగదీసింది.. ప్రస్తుతం ఈ వీడియో  వైరల్‌ అవుతుంది. ప్రోమోనే ఇలా ఉందంటే ఇక.. పాట ఎలా  ఉంటుందో అని మరింత ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - Dec 29 , 2023 | 11:55 AM