సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kriti Sanon: ప్రభాస్‌పై పొగడ్తల వర్షం!

ABN, First Publish Date - 2023-05-10T13:42:34+05:30

ప్రభాస్‌ కీలక పాత్రలో నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’(Adipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ (Om raut)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. తొలుత విడుదల చేసిన టీజర్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మాత్రం చక్కని స్పందన వస్తోంది. అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. రామాయణం ఇతిహాసంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతీసనన్‌ నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భారత్‌తోపాటు 70 దేశాల్లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో కృతీసనన్‌ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ‘‘రాముడిలాగే ప్రభాస్‌ మంచివాడని కితాబిచ్చింది. చాలా సింపుల్‌గా ఉంటాడని పొగడ్తల్లో ముంచేసింది. దీంతో మరోసారి వీరిద్దరూ వార్తలో నిలిచారు. Kriti

గతంలో టీజర్‌ విడుదల చేసిన కొన్నాళ్లకు ప్రభాస్‌ - కృతీసనన్‌ డేటింగ్‌లో ఉన్నారని, నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని త్వరలో పెళ్లి ఉంటుందని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కొంతగ్యాప్‌ తర్వాత ఇద్దరూ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు. ఇప్పుడు కృతీసనన్‌ పొగడ్తలతో మరోసారి ట్రెండింగ్‌లో ఉందీ జంట. ఓంరౌత్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-05-10T13:42:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!