కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Krithi Shetty : శర్వానంద్‌తో కలిసి ఆడిపాడటానికి..!

ABN, First Publish Date - 2023-09-21T13:12:12+05:30

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న 35వ సినిమాలో హీరోయిన్‌గా కృతీశెట్టి హీరోయిన్‌గా ఖరారైంది. చాలాకాలంగా ఈ చిత్రంలో శర్వాకు జోడీగా కృతి నటించనునందనే వార్తలు వస్తున్నాయి.

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న 35వ సినిమాలో హీరోయిన్‌గా కృతీశెట్టి హీరోయిన్‌గా ఖరారైంది. చాలాకాలంగా ఈ చిత్రంలో శర్వాకు జోడీగా కృతి నటించనునందనే వార్తలు వస్తున్నాయి. గురువారం కృతీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌, గ్లింప్స్‌ విడుదల చేసింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్‌ దాస్‌, హీరో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ ఆదిత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్‌గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్‌ మినహా మిగతా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. అక్టోబర్‌ నుంచి ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఓ విభిన్నమైన పాత్రలో శర్వానంద్‌ కొత్తగా కనిపించనున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా, జానీ షేక్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T13:12:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!