Super Star Krishna: సొంతవూరు బుర్రిపాలెంలో కుటుంబ సభ్యుల, అభిమానుల నడుమ....

ABN , First Publish Date - 2023-07-27T16:05:05+05:30 IST

వచ్చే నెల అంటే ఆగస్టు 5న కృష్ణ గారి పుట్టిన వూరు బుర్రిపాలెంలో కృష్ణ గారి అభిమానులు, కుటుంబ సభ్యులు అతని గుర్తుగా కృష్ణగారి విగ్రహాన్ని పెడుతున్నారు. దానికి కృష్ణ గారి కుటుంబ సభ్యులు, పరిశ్రమకి చెందిన చాలామంది, అలాగే కృష్ణ గారితో పని చేసిన వ్యక్తులు కూడా వస్తున్నారు అని తెలిసింది

Super Star Krishna: సొంతవూరు బుర్రిపాలెంలో కుటుంబ సభ్యుల, అభిమానుల నడుమ....
Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారికి వున్న అభిమాన సంఘాలూ, అభిమానులు వేరే ఏ స్టార్ కి కూడా వుండవు అని అంటారు. అది నిజం కూడాను. సూపర్ స్టార్ కృష్ణ గారు మే 31 అయన పుట్టినరోజును అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించేవారు, కృష్ణగారు ఎక్కడుంటే అక్కడకి వెళ్లి అభినందనలు తెలిపే వారు. ఒక్కోసారి కృష్ణగారు ఊటీ లో ఉంటే అక్కడికే బస్సులో అభిమానులు వెళ్లి అతని పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసేవారు. కృష్ణ గారు గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన పరమపదించారు.

burripalem.jpg

కృష్ణ గారి సొంతవూరు గుంటూరు జిల్లాలో వున్న బుర్రిపాలెం (Burripalem) అనే గ్రామం. అక్కడే 1943, మే 21 న పుట్టారు. కృష్ణ గారు ఆక్టివ్ గా వున్నప్పుడు తన సొంత ఊరుకి వెళుతూ ఉండేవారు, అలాగే అక్కడ కొన్ని సినిమాలు షూటింగ్స్ కూడా అవుతూ ఉండేవి. కృష్ణ గారు చదువుకున్నది మాత్రం ఏలూరు పట్టణంలో.

burripalem1.jpg

కథానాయకుడిగా మొదటి సినిమా 1965 లో విడుదలైన 'తేనెమనసులు' (TeneManasulu). ఆదుర్తి సుబ్బారావు (AdurthiSubbaRao) దీనికి దర్శకుడు, ఎక్కువగా కొత్తవాళ్లతో ఈ సినిమా నిర్మించారు. కృష్ణ తో పాటు రామ్ మోహన్ (RamMohan) అనే ఇంకో నటుడు కూడా కథానాయకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. అలాగే ఈ సినిమాలో సంధ్యారాణి (SandhyaRani), సుకన్య (Sukanya) ఇద్దరూ కథానాయికలు. మొదటి సినిమా నుండే కృష్ణ గారు ఇక వెనక్కి చూసుకోలేదు, అయన ప్రయాణం అప్రతిహతంగా నాలుగు దశాబ్దాల పాటు సాగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ ఎవరంటే కృష్ణ గారే అని చెప్పేవారు. అతని సినిమాలు అతనికే పోటీగా విడుదలైన సందర్భాలు ఎన్నో వున్నాయి.

krishnastatue.jpg

350కి పైగా సినిమాలు చేసిన కృష్ణ గారికి అతని కుటుంబ సభ్యులు, అభిమానులు కలిపి బుర్రిపాలెం లో ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందుకని కృష్ణ గారి విగ్రహాన్ని కృష్ణ పుట్టిన వూరు అయిన బుర్రిపాలెం లో ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఈ వేడుక ఆగస్టు 5న (August 5) ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని తెలిసింది. దీనికి కృష్ణ సోదరుడు జి ఆదిశేషగిరిరావు (GAdiseshagiriRao) ఈ వ్యవహారం చూసుకుంటున్నారని, పరిశ్రమ నుండి కూడా చాలామంది ఈ విగ్రహావిష్కరణకు హాజరవుతారని తెలిసింది. అలాగే కృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఈ ఫంక్షన్ కి వస్తున్నట్టుగా సమాచారం. అయితే కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) ప్రస్తుతం వెకేషన్ లో వున్నారు, లండన్ వెళ్లారు, అతను ఆ సమయానికి వస్తున్నారో లేదో తెలియదు అని అంటున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం సంతాపసభ కూడా ఉంటుందని తెలిసింది.

Updated Date - 2023-07-27T17:09:51+05:30 IST