Kota Srinivasarao: కోట వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనా?

ABN , First Publish Date - 2023-06-03T16:32:28+05:30 IST

వి బి ఎంటర్టైన్మెంట్స్ యుగపురుషుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు, ఎన్ టి ఆర్ మెమోరియల్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావుని(kota Srinivasarao), చంద్రమోహన్‌, బాబుమోహన్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ పారితోషికం పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు కోట.

Kota Srinivasarao: కోట వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనా?

వి బి ఎంటర్టైన్మెంట్స్ యుగపురుషుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు, ఎన్ టి ఆర్ మెమోరియల్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావుని(kota Srinivasarao), చంద్రమోహన్‌, బాబుమోహన్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావుని(kota Srinivasarao), చంద్రమోహన్‌, బాబుమోహన్‌ తదితరులను ఘనంగా సత్కరించారు. సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కసే. విషాదకర పాటలకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌ బాబు సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం, 40 రోజులు అని పబ్లిక్‌గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీదేవితో డాన్స్‌ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు నాలాంటి వాడు అలా డాన్స్‌లు చేస్తే ముసలోడు అంటారు’’ అని అన్నారు. (Kota Comments on Pawan kalyan)

అలాగే ‘మా’ అసోసియేషన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్‌ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని (Manchu Vishnu) కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో పది కోట్లతో సినిమా తీస్తే.. ఆ సినిమాకు ప్రభుత్వం నుంచి డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా ప్రభుత్వ, తదితర లొకేషన్స్‌ ఉచితంగా ఇస్తాం’ అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్‌ రాయండి’’ అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్‌ క్లీన్‌ చేేస బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’’ అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ఓ వేదికపై పవన్‌కల్యాణ్‌ తన పారితోషికం గురించి మాట్లాడారు. తాజా చేస్తున్న చిత్రాల్లో ఒక దానికి రోజుకి రెండు కోట్లు పారితోషికం ఇస్తున్నారని, 40 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని పరోక్షంగా శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పవన్‌పై విమర్శలు చేయడంల పట్ల అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. పారితోషికాలు బయట పెట్టడం, పెట్టకపోవడం వారి వ్యక్తిగత విషయం మధ్యలో మీకెందుకు? అంటూ కోట శ్రీనివాసరావుని ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు ఈవెంట్ ఆర్గనైజర్, మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన.

Updated Date - 2023-06-04T12:53:30+05:30 IST