Korameeenu Film Director: ఆ ఒక్క మాట.. వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది

ABN , First Publish Date - 2023-01-04T18:31:55+05:30 IST

‘కొరమీను’ (Korameeenu) సినిమా విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి.. ‘ఈరోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ..

Korameeenu Film Director: ఆ ఒక్క మాట.. వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది

‘కొరమీను’ (Korameeenu) సినిమా విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి.. ‘ఈరోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా’ అనడంతో.. ఆ సినిమాకి సంబంధించి మాత్రమే కాదు... నా జీవితానికి సంబంధించి నేను అందుకున్న అతి పెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అదని అంటున్నారు యువ దర్శకుడు శ్రీపతి కర్రి (Sripathy Karri). తొలి చిత్రం ‘హల్ చల్’ (Hulchul)తో ఓ మోస్తరు విజయం అందుకున్న ఈ వైజాగ్ కుర్రాడు తీసిన రెండో సినిమా ‘కొరమీను’. ఆనంద్ రవి (Anand Ravi) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి (Samanya Reddy) నిర్మించారు. 2022కి ఘనమైన వీడ్కోలు పలుకుతూ.. డిసెంబర్ 31న ‘కొరమీను’ చిత్రం విడుదలైన విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఈ సినిమా ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నాడీ ‘ఎమ్.బి.ఎ’ కుర్రాడు... ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలే పడ్డానని చెబుతున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘2020లో విడుదలైన ‘హల్ చల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నేను... తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కో - డైరెక్టర్‌గా పని చేయాల్సి వచ్చింది. అయినా ఢీలా పడలేదు. సినిమా పిచ్చితో 2006లో హైదరాబాద్ వచ్చేసి... ‘కొరమీను’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చేంతవరకు.. నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కోల్పోలేదు. పస్తులుండాల్సి వచ్చిన రోజుల్ని... సినిమా రంగంలో సక్సెస్ కావడానికి నేను చేస్తున్న ఉపవాసాలుగా భావిస్తుండేవాడిని. ఈ ప్రయాణంలో మా అక్కా-బావ... మిత్రుడు వినోద్, అమ్మానాన్న, నా భార్య నాకు ఎంతగానో అండగా నిలిచారని తెలుపుతూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా జాబ్ చేస్తూ... ఫ్యామిలీని నడిపిస్తూ.. సపోర్ట్ సిస్టమ్‌గా నిలిచిన తన లైఫ్ పార్టనర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నాడు శ్రీపతి. ‘సినిమా రంగంలో నువ్వు కచ్చితంగా రాణిస్తావురా’ అని తనను ఎంతగానో ప్రోత్సహించిన తన గురువు సదానంద్‌గారికీ ఆయన ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలిపారు. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. (Korameeenu Director Sripathy Karri)

Updated Date - 2023-01-04T18:31:56+05:30 IST