komatireddy venkat reddy : కనీసం విషెస్‌ చెప్పలేదంటూ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-12-11T14:26:51+05:30 IST

తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా (Cinematography Minister) ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెట్టి (komatireddy venkat reddy) తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

komatireddy venkat reddy : కనీసం విషెస్‌ చెప్పలేదంటూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా (Cinematography Minister) ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెట్టి (komatireddy venkat reddy) తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశ్రమ నుంచి ఎవరు  స్పందించలేదని మండిపడ్డారు. దిల్‌ రాజు (Dil raju) తప్ప కనీసం వరూ విషెస్‌ చెప్పలేదని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ "సినీ ఇండస్ట్రీ  నుంచి నిర్మాత దిల్‌రాజు తప్ప సినిమా వాళ్లు ఎవరూ నాకు ఫోన్‌ చేయలేదు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. వారం రోజుల్లో సినీ ఇండస్ట్రీపై నివేదిక ఇవ్వాలని మా సెక్రటరీని ఆదేశించాను’’ అని అన్నారు. (Comments on TFI)

అయితే దిల్‌రాజు అమెరికా పర్యటనలో ఉండడం వల్ల మంత్రిని కలిసేందుకు వెళ్లలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇండియాకు తిరిగి రాగానే మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-11T14:26:57+05:30 IST