కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kirrak RP : ప్రేమించిన అమ్మాయితో పెళ్లి!

ABN, First Publish Date - 2023-11-30T19:57:03+05:30

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ కిరాక్‌ ఆర్పీ ఓ ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నను వివాహమాడారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇష్టపడిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు ఆర్‌పీ.

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ కిరాక్‌ ఆర్పీ (Kirrak Rp) ఓ ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నను వివాహమాడారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇష్టపడిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు ఆర్‌పీ. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వీరి వివాహం నవంబర్‌ 29న జరిగింది. ‘‘మేం ప్రేమ వివాహం చేసుకున్నాం. లక్ష్మీప్రసన్నది విశాఖపట్నం. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు వి.ఐ.పి.లు, సినీ సెలబ్రిటీలు వచ్చారు. వివాహాన్ని మాత్రం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగాలనుకున్నాం అందుకూ సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాం’’ అని కిరాక్‌ ఆర్పీ తెలిపారు.

జబర్దస్త్‌తోపాటు పలు టీవీ షోలో కనిపించిన ఆర్‌పీ ‘వజ్ర కవచధర గోవింద’, ‘ఇదేం దెయ్యం’, ‘ఎంఎంఓఎఫ్‌’ తదితర చిత్రాల్లో నటించారు. తర్వాత టీవీ రంగానికి దూరమై వ్యాపారంపై దృష్టిపెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో టేక్‌ అవేస్‌ పెట్టారు.

Updated Date - 2023-11-30T21:28:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!