Bigg boss 7 First Elimination : బయటకు వచ్చాక కిరణ్‌ చేసిన కామెంట్స్‌ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-11T11:08:48+05:30 IST

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో మొదటి ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. నటి కిరణ్‌ రాథోడ్‌.. ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌ నుంచి బయటికి వచ్చేసింది. షో ప్రారంభమై వారం గడిచింది. ఇంటి సభ్యులు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా క్లోజ్‌ అయ్యారు. అలా స్నేహితులుగా మారిన వారిలో షకీలా, కిరణ్‌ రాథోడ్‌ ఒకరు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో జరిగిన గేమ్‌లో ఒకరికొకరు లైక్‌ సింబల్‌ ఇచ్చుకున్నారు.

Bigg boss 7 First Elimination : బయటకు వచ్చాక కిరణ్‌ చేసిన కామెంట్స్‌ ఏంటంటే..

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7(Biggboss 7)లో మొదటి ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. నటి కిరణ్‌ రాథోడ్‌..(Kiran rathod) ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌ నుంచి బయటికి వచ్చేసింది. షో ప్రారంభమై వారం గడిచింది. ఇంటి సభ్యులు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా క్లోజ్‌ అయ్యారు. అలా స్నేహితులుగా మారిన వారిలో షకీలా, కిరణ్‌ రాథోడ్‌ ఒకరు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో జరిగిన గేమ్‌లో ఒకరికొకరు లైక్‌ సింబల్‌ ఇచ్చుకున్నారు. నామినేషన్స్‌, ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా యావర్‌, కిరణ్‌ సేఫ్‌ జోన్‌లో లేరు. ఇద్దరిలో ఎవరో ఒకరు బయటు వెళ్లాలి. ఫైనల్‌గా కిరణ్‌ రాధోడ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. దాంతో షకీలా కన్నీరుమున్నీరయ్యారు. హౌస్‌ నుంచి స్టేజ్‌ మీదకి వచ్చిన కిరణ్‌ రాథోడ్‌.. కంటెస్టెంట్స్‌లో నలుగురికి ఉల్టా, నలుగురి సీదా ట్యాగ్‌ ఇచ్చింది.

కిరణ్‌ బయటకు వెళ్లడానికి భాష సమస్య ఒకటిరాగా, పెద్దగా ఆమె ఆడింది లేదు. ఎక్కువగా ఇంటి సభ్యులతో కనెక్ట్‌ కూడాకాలేదు. దీంతో ప్రేక్షకులు తనను ఎక్కువకాలం హౌజ్‌లో ఉంచడం అనవసరం అనుకొని మొదటి వారమే బయటికి పంపించేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చాక టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్‌, రతిక, శోభాశెట్టిలకు ఉల్టా అనే ట్యాగ్‌ ఇచ్చింది కిరణ్‌. దానికి కారణాలు చెప్పింది.

పల్లవి ప్రశాంత్‌ చాలా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఇప్పటికే తను విన్నర్‌ అనేసుకుంటున్నాడు’ అని కిరణ్‌ రాథోడ్‌ స్ట్రెయిట్‌గా చెప్పేసింది. రతికతో హౌజ్‌లో ఉన్నప్పుడు తన వైబ్‌ అసలు మ్యాచ్‌ అవ్వలేదని తెలిపింది. మనం అక్కడే కూర్చొని ఉన్నా.. తను పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతుంది కానీ కనీసం చూసి నవ్వదు అంటూ తన ప్రవర్తనను విమర్శించింది. దీనికి జవాబుతగా రతిక.. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుందని, ఇప్పటి నుంచి ప్రవర్తనను మార్చుకుంటానని చెప్పింది. టేస్టీ తేజ నవ్విస్తూనే మంచి గేమ్‌ ప్లాన్‌తో ఉన్నాడని, తనను ఎవరూ నమ్మకండి అంటూ కంటెస్టెంట్స్‌ను హెచ్చరించింది. శోభాశెట్టి చాలా సా?్వర్థపరురాలు అని చెప్పింది. యావర్‌, షకీలా, శివాజీ, శుభశ్రీకి సీదా అనే ట్యాగ్‌ ఇస్తూ వారి గేమ్‌ కోసం ఆల్‌ ది బెస్ట్‌ తెలిపింది.

1.jpg

బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరే బిగ్‌ బాస్‌ బజ్‌లో ఇంటర్వ్యూలో ఇచ్చిన తర్వాతే బయటికి వెళ్తారు. ఇప్పుడు ఈ సీజన్‌ ఇంటర్వ్యూలు చేయడానికి గీతూ రాయల్‌ను ఎంపిక చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రొమో రిలీజ్‌ అయింది. గీత ప్రశ్నలకు కిరణ్‌ రాథోడ్‌ ఇలా జవాబిచ్చింది. ‘నేను హౌజ్‌లో ఉండాలా వద్దా అని ప్రేక్షకులు చాలా త్వరగా డిసైడ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఉన్నట్టుగా హౌజ్‌లో ఎందుకు హాట్‌గా లేరు అన్న ప్రశ్నకు ‘ఇది ఒక ఫ్యామిలీ షో అని దామిని చెప్పింది’ అని సమాధానం ఇచ్చింది. ‘అంటే దామిని ఆడించిన తోలు బొమ్మ కిరణ్‌ రాథోడ్‌’ అని గీతూ అనగా.. కిరణ్‌ ఏ సమాధానం చెప్పలేదు. ‘కావచ్చు’ అన్నట్టు ఎక్ర్‌ప్రెషన్‌ ఇచ్చింది. మీరు వీక్‌ అన్న మాటను కూడా కిరణ్‌ ఒప్పుకుంది. ప్రేక్షకులు కంటెస్టెంట్‌ నుంచి ఏం కోరుకున్నారో అది తాను చేయలేకపోతున్నానని ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. ‘ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే మీలో ఏం మార్చుకుంటారు’ అని అడిగితే ‘నేను తెలుగులో మాట్లాడతాను. వారు అన్న మాటలకు తెలుగులోనే తిరిగి సమాధానం ఇస్తాను’ అంది.

ఇంటి సభ్యులు పేర్లు గీతే చెబుతుండగా కిరణ్‌ రాథోడ్‌ వారికి ట్యాగ్స్‌ ఇచ్చింది. శుభశ్రీని డంబ్‌ అని, శోభాశెట్టిని నాగిన్‌ అని చెప్పింది కిరణ్‌. దామిని తనకు తాను ఉమెన్‌ కార్డును అడ్డం పెట్టుకుంటుందని కిరణ్‌ కామెంట్‌ చేసింది. ప్రశాంత్‌ ఇప్పటికే చాలా ప్రిపేర్‌ అయ్యి వచ్చాడని, ఏదో ఒకరోజు అదే తనను దెబ్బతీస్తుందని, ప్రేక్షకులని కనిపెట్టేస్తారని చెప్పింది. గౌతమ్‌ తరువాతి వారంలో కచ్చితంగా ఎలిమినేట్‌ అయిపోతాడని నమ్మకంగా చెప్పింది. టేస్టీ తేజ వల్లనే తాను ఎలిమినేట్‌ అయిపోయానంటూ తన ఫోటోపై గుడ్డు కొట్టింది. తేజతో పాటు శోభాశెట్టి పల్లవి ప్రశాంత్‌ ఫోటోలపై కూడా గుడ్లు కొట్టింది.

Updated Date - 2023-09-11T12:02:08+05:30 IST