Khushbu: నా బెడ్ రూమ్ లో అమితాబ్ ఫోటోస్ ఉంటాయి

ABN , First Publish Date - 2023-04-18T16:49:07+05:30 IST

ఒకప్పటి కథానాయకురాలు అయిన ఖుష్బూ ఇప్పుడు జగపతి బాబు పక్కన 'రామ బాణం' అనే సినిమాలో చేస్తోంది. ఆమె ఈ సినిమా గురించి, అలాగే ఆమె ఎవరితో చెయ్యాలనుకుంటుందో కూడా చెప్పింది. అదెవరు అంటే...

Khushbu: నా బెడ్ రూమ్ లో అమితాబ్ ఫోటోస్ ఉంటాయి

ఖుష్బూ (Khushbu) ఇటు సినిమాలతోనూ అటు రాజకీయాలతోనూ బిజీ గా వున్నా నటీమణుల్లో ఒకరు. ఆమె తెలుగులో ఇప్పుడు 'రామబాణం' (Rama Banam) సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఆమె పాత్ర పేరు భువనేశ్వరి అని చెప్పింది. జగపతి బాబుతో (Jagapathi Babu) ఈ సినిమాలో ఖుష్బూ కనిపిస్తుంది. శ్రీవాస్ (Sriwass) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5న విడుదల అవుతుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర ఒక సందేశం ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్తోంది ఖుష్బూ. "ఈ సినిమా కథ నేపధ్యం ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్లినా కుటుంబ బంధాలను మరువకూడదు, అది చాలా ముఖ్యం" అని చెప్పింది ఖుష్బూ.

khushbu.jpg

ఇంతకు ముందు మన ఇళ్లల్లో ఎలాంటి సంప్రదాయాలు ఉండేవి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండేవి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ తినటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి లాంటివి గుర్తు చేస్తూ సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా ఖుష్భు పాత్ర ఉంటుంది అని చెప్తోంది.

ఖుష్బూ 'కలియుగ పాండవులు' లో వెంకటేష్ (Venkatesh Daggubati) పక్కన తన మొదటి సినిమా చేసింది. అయితే ఆ తరువాత తమిళ పరిశ్రమలోనే స్థిరపడిపోయింది ఈమె. అప్పట్లో తెలుగు పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది. ఆ తరువాత తెలుగు పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చింది, కానీ ఖుష్బూ కుటుంబం కోసం చెన్నై లో ఉండిపోవాల్సి వచ్చింది, అలాగే అప్పుడు తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందువల్ల తెలుగులో చెయ్యడానికి అవలేదు, అందుకనే 'చంటి' లాంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పింది ఖుష్బూ.

khushbu1.jpg

ఒకప్పుడు కథానాయకురాలిగా, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా ఖుష్బూ బిజీ గానే వుంది. మరి ఎప్పుడైనా ఫలానా పాత్ర చేయలేకపోయాను అని అనుకున్నారా, అన్న ప్రశ్నకి ఆమె సమాధానం షాకిచ్చింది. "టబ్బు,(Tabu) అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తో కలిసి 'చీని కం' (Cheeni Kum) లో నటించింది. ఆ సినిమా ఛాన్స్ ఆమె కొట్టేసినందుకు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ గారికి చాలా పెద్ద అభిమానిని. నా బెడ్ రూమ్ లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే ఆ బాధ ఎప్పుడూ వుంది," అని చెప్పింది ఖుష్భు.

Updated Date - 2023-04-18T16:49:08+05:30 IST