keerthy suresh: ఏమైంది మీకు.. చాలా కష్టంగా ఉంది మాకు!

ABN , First Publish Date - 2023-03-18T13:50:45+05:30 IST

‘మహానటి’(Mahanati) చిత్రంలో సావిత్రి పాత్రలో అభినయించి దక్షిణాది ప్రేక్షకులను తనవైపు తిప్పుకొన్నారు కీర్తి సురేశ్‌(Keerthy suresh).

keerthy suresh: ఏమైంది మీకు.. చాలా కష్టంగా ఉంది మాకు!

‘మహానటి’(Mahanati) చిత్రంలో సావిత్రి పాత్రలో అభినయించి దక్షిణాది ప్రేక్షకులను తనవైపు తిప్పుకొన్నారు కీర్తి సురేశ్‌(Keerthy suresh). కెరీర్‌ బిగినింగ్‌ నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఆమె ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా కీర్తిని ఆ తరహా పాత్రల్లో ట్రెడీషనల్‌గా చూడటానికే ఇష్టపడుతుంటారు. ‘సర్కార్‌ వారి పాట’ (Sarkaru vaaripaata) చిత్రం నుంచి తన లుక్‌, ట్రెండ్‌ మార్చింది. స్కిన్‌ షో డోస్‌ పెంచింది. తనలో గ్లామర్‌ యాంగిల్‌ (Glomour angle) కూడా ఉందని నిరూపిస్తూ ఫొటో షూట్స్‌ (Keerthy Suresh Hot Photo Shoot) చేస్తుంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్‌లో శ్రుతి మించి అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలను కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ‘బ్లూమింగ్‌ బోల్డ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి యువతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆమెను అభిమానించే వారైతే.. ‘మీరు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తూ, మా మదిని దోచుకుంటారు. ఇలా హాట్‌ లుక్‌లో మిమ్మల్ని ఊహించుకోలేకపోతున్నాం’’ అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ‘మీలో ఈ హాట్‌ యాంగిల్‌ కూడా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘అసలు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం. ఏమైంది కీర్తి మీకు.. ఎందుకు ఇలాంటి ఫొటో షూట్స్‌ చేస్తున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది’’ అని పోస్టులు పెడుతున్నారు. కీర్తి సురేశ్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆరు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం దసరా’ ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. మరో పక్క చిరంజీవికి చెల్లెల్లిగా ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. (Fans Unhappy with Keerthy Hot photo shoot).

Updated Date - 2023-10-28T11:56:47+05:30 IST