Keerthy Suresh: ఆ స్కోప్‌ ఉండటంతో పర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది!

ABN , First Publish Date - 2023-08-05T21:28:53+05:30 IST

‘మహానటి’లో సావిత్రి పాత్రకు ప్రాణం పోసి ఎనలేని కీర్తి సంపాదించుకున్నారు కీర్తి సురేశ్‌. తన కెరీర్‌కు ఏది ప్లస్‌ అవుతుందో ఆ చిత్రాలనే చేస్తుంటారామె. తాజాగా ఆమె నటించిన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.

Keerthy Suresh: ఆ స్కోప్‌ ఉండటంతో పర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది!

మహానటి’లో సావిత్రి పాత్రకు ప్రాణం పోసి ఎనలేని కీర్తి సంపాదించుకున్నారు కీర్తి సురేశ్‌(Keerthy suresh). తన కెరీర్‌కు ఏది ప్లస్‌ అవుతుందో ఆ చిత్రాలనే చేస్తుంటారామె. తాజాగా ఆమె నటించిన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్‌ రమేశ్‌ (meher Ramesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాంబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఆ పాత్ర గురించి ఆమె విలేకర్లతో మాట్లాడారు.

‘అన్నాత్తే’ చిత్రంలో రజనీ సర్‌కి చెల్లిగా కనిపించా. ఆ సినిమా పూర్తయ్యాక ‘భోళా శంకర్‌’ ఆఫర్‌ వచ్చింది. సౌత్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలకు చెల్లిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి! ఇదంతా మాటల్లో చెప్పలేని ఆనందం. అయితే ‘భోళా శంకర్‌’లో మరో ప్రత్యేకత ఉంది. అది చిరంజీవి గారితో డ్యాన్స్‌ చేేస అవకాశం దొరకడం. ఆయనతో ఒక్క ఫ్రేమ్‌లో అయినా డాన్స్‌ చేయాలని కోరిక ఉండేది. ఇందులో రెండు పాటల్లో డాన్స్‌ చేశా. ఇది ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల మీద సాగే కథ. బ్రదర్‌, సిస్టర్‌ ఎమోషన్‌తోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పక్కా ప్యాకేజ్‌గా ఉంటుంది. సిస్టర్‌ క్యారెక్టర్‌ అనగానే డాన్స్‌ చేసే అవకాశం ఉండదని భయపడ్డా. కానీ ఇందులో నా పాత్రకు ఆ స్కోప్‌ ఉంది. అన్నయ్యతో బబ్లీగా, జాలీగా వుండే క్యారెక్టర్‌ కాబట్టి అది సూపర్‌గా కుదిరింది.

అప్పుడు అమ్మకి.. ఇప్పుడు నాకు..

నిజజీవితంలో నాకు అక్క ఉంది. అన్నదమ్ములు లేరు. కానీ బ్రదర్‌ లాంటి ఫ్రెండ్‌ ఉన్నారు. ఈ సినిమాతో చిరంజీవిగారితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. 1980 గ్రూప్‌లో మా అమ్మా చిరంజీవికిగారి ఫ్రెండ్‌ అయితే.. ఇప్పుడు ఆయనకు నేను కొత్త ఫ్రెండ్‌ని(నవ్వుతూ). ఇద్దరం క్లోజ్‌ అయినా సెట్‌లో మాత్రం ఆయన్ను చిరుగారు అనే పిలిచేదాన్ని. సెట్‌లో ఆయన ఇచ్చిన సలహాలు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అవి చాలా విలువైనవి. పైగా ప్రతి రోజు ఇంటి నుంచి నాకు భోజనం తీసుకొచ్చేవారు. నాకు ఫలానాది కావాలని అడిగి మరీ తెప్పించుకునే దాన్ని. మా ఇద్దరి మధ్య ఫుడ్‌ అనేది మెయిన్‌ టాపిక్‌ అయిపోయింది. ఆయన ఇంటి నుంచి వచ్చిన ఉలవచారు, కాకరకాయ తెగ నచ్చాయి. ప్రతి రోజు ఇంటి నుంచి ఏం వస్తుందో మెనూ చెప్పేవారు. మరచిపోలేని జర్నీ ఇది.

2.jpg


‘స్ర్టీట్‌ స్మార్ట్‌ నువ్వు’ అన్నారు..

చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్‌, అలాగే సెట్‌లో ఇచ్చిన సలహా, సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్‌గా చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పేవారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు.. చిరంజీవి రియాక్షన్‌ నాకు చాలా సర్ర్పైజ్‌ చేసింది. ‘’మీ అమ్మగారు ఇంతే చెప్పిందా.. నేను తనతో చాలా చెప్పాను’ అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తువుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ‘మీ అమ్మ చాలా అమాయకురాలు.. నువ్వు మాత్రం అలా కాదు. ‘స్ర్టీట్‌ స్మార్ట్‌ నువ్వు’ అని చిరంజీవి గారు అన్నారు.

1.jpg

పల్స్‌ తెలిసిన దర్శకుడు..

మెహర్‌ రమేశ్‌ కథ చెప్పినప్కుపడు చాలా నచ్చింది. అప్పుడే రజనీకాంత్‌ గారికి సిస్టర్‌ గా చేశాను కదా అని ఆయనతో చెప్పాను. అయినా ఫర్వాలేదన్నారు. చాలా కంఫర్ట్‌ డైరెక్టర్‌ ఆయన. కమర్షియల్‌ మీటర్‌ , ఆడియన్స్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు. నిజానికి మెహర్‌ గారిని అన్నయ్యలా భావిస్తాను. ఈ సినిమాతో తనకో చెల్లి దొరికింది నాకో అన్నయ్య దొరికారు.

చూడటానికి ఈజీనే...

ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడం అంతా ఈజీ కాదు. చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఇలా బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. అన్నీ సినిమాలు చేయలనేది నా కోరిక. పదేళ్ళ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకున్నపుడు ఇది మనం చేయలేదే అని అనిపించకూడదు.

Updated Date - 2023-08-05T21:28:53+05:30 IST