కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT: ఓటీటీ వీక్షకుల కోసం  ‘కీడా కోలా’

ABN, Publish Date - Dec 19 , 2023 | 06:48 PM

తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker Dhaassyam) స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కీడా కోలా’(keeda kola).  నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచింది. ఇప్పుడీ క్రైమ్‌ కామెడీ చిత్రం ఈ నెల 29 నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్‌ ఖాతాదారులకు మాత్రం ఓరోజు ముందుగా డిసెంబర్‌ 28నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.

తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker Dhaassyam) స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కీడా కోలా’(keeda kola).  నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచింది. ఇప్పుడీ క్రైమ్‌ కామెడీ చిత్రం ఈ నెల 29 నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్‌ ఖాతాదారులకు మాత్రం ఓరోజు ముందుగా డిసెంబర్‌ 28నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. రానా సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, చైతన్య రావు తదితరులు నటించారు. (AHA OTT)

కథ: వాస్తు (చైతన్యరావు), అతని తాత వరదరాజు (బ్రహ్మానందం), లాయర్‌ అయిన కౌశిక్‌ (రాగ్‌ మయూర్‌) వీళ్లందరి లక్ష్యం డబ్బు సంపాదనే!  తాత కోసం కొన్న శీతల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింకని చూపించి యజమానిని బ్లాక్‌మెయిల్‌ చేయాలని ప్లాన్  వేస్తారు.  రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్‌ (జీవన్‌)కి కార్పొరేటర్‌ కావాలనేది ఆశ. 20 ఏళ్లు జైల్లో ఉండి  బయటికి వచ్చిన తన అన్న నాయుడు అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. జీవన్‌ కార్పొరేటర్‌ కావాలన్నా కూడా డబ్బే అవసరం కావడంతో అందుకోసం వీళ్లు కూడా ఓ వ్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? అనుకున్న డబ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవన్‌ గ్యాంగ్‌ ఎలా కలిశారు? ఇంతకీ కోలాలో బొద్దింక ఎలా పడింది? తదితర విషయా?ని తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. 

Updated Date - Dec 19 , 2023 | 06:52 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!