కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవంబర్‌లో కీడా కోలా

ABN, First Publish Date - 2023-09-16T00:35:22+05:30

తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘కీడా కోలా’. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు....

తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘కీడా కోలా’. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాను ప్రేక్షకులకు చేరువ చేశాయి. శుక్రవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్‌ 3న ‘కీడాకోలా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో బ్రహ్మానందం, తరుణ్‌భాస్కర్‌, చైతన్యరావు సీరియస్‌ లుక్‌లో కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. తరుణ్‌ భాస్కర్‌ గత చిత్రాలు ‘పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది’ తరహాలోనే ఈ చిత్రం కూడా యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా రూపొందుతోందని యూనిట్‌ పేర్కొంది. విజి సైన్మా పతాకంపై కె వివేక్‌ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నండూరి, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్రవర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ:ఏజే ఆరోన్‌. ఎడిటర్‌: ఉపేంద్ర వర్మ

Updated Date - 2023-09-16T00:35:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!