RIP Harikanth: ‘కీడా కోలా’ నటుడు గుండెపోటుతో మృతి!

ABN , First Publish Date - 2023-07-01T14:13:46+05:30 IST

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు గుండెపోటుతో మరణించారు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘కీడా కోలా’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హరికాంత్‌ (33) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు.

RIP Harikanth: ‘కీడా కోలా’ నటుడు గుండెపోటుతో మృతి!

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు గుండెపోటుతో మరణించారు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘కీడా కోలా’ (Keedaa cola) చిత్రంలో కీలక పాత్ర పోషించిన హరికాంత్‌ (33) (harikanth) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు. చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. థియేటర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరికాంత్‌ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్నాడు. పలు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ‘కీడా కోలా’ చిత్రం టీజర్‌లో హరికాంత్‌ సీన్‌ చూడొచ్చు. యువ నటుడు హరికాంత్‌ మృతిపట్ల చిత్ర బృందంతోపాటు పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (Rip Harikanth)

Updated Date - 2023-07-01T16:04:18+05:30 IST