Virupaksha - Karthik Dandu: ఆ పాత్ర మార్చడానికి ఏడు నెలలు పట్టింది

ABN , First Publish Date - 2023-06-12T16:25:04+05:30 IST

విరూపాక్ష' (Virupaksha) చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు కార్తిక్‌ వర్మ దండు (Karthik varma). సాయితేజ్‌,(Sai tej) సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై వంద కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఓ వేదికపై దర్శకుడు ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయలు వెల్లడించారు.

Virupaksha - Karthik Dandu: ఆ పాత్ర మార్చడానికి ఏడు నెలలు పట్టింది

'విరూపాక్ష' (Virupaksha) చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు కార్తిక్‌ వర్మ దండు (Karthik varma). సాయితేజ్‌,(Sai tej) సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై వంద కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఓ వేదికపై దర్శకుడు ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయలు వెల్లడించారు. ఆరేళ్ల క్రితం ఓ పేపర్‌ వచ్చిన క్రైం న్యూస్‌ ఈ కథకు నాంది పలికిందని చెప్పారు.

‘‘చిన్నప్పటి నుంచి హారర్‌ సినిమాలంటే ఆసక్తి. ఆ జోనర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చేయాలనే నా కోరిక. అలాంటి సమయంలో 2016-17 సంవత్సరంలో పేపర్‌లో వచ్చిన ఓ క్రైమ్‌ వార్త చదివాను. ఉత్తరాదిలో ఓ ఊరికి చెందిన మహిళ.. తన భర్త చనిపోవడంతో ఆ ఊరి చివర నివాసం ఉండేది. అదే సమయంలో ఆ ఊర్లో ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. గ్రామస్థులందరూ ఆ మహిళను అనుమానించి.. అతి క్రూరంగా చంపేశారు. ఈ వార్త చదివిన తర్వాతే ‘విరూపాక్ష’ కథ రాయాలనిపించింది. అయితే నేను రాసిన కథలో పార్వతి పాత్రధారి శ్యామల విలన్‌. తల్లిదండ్రు?ని చనిపోయాక.. ఆమె ఆ ఊరు నుంచి పారిపోయి.. కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి కోడలిగా వచ్చి.. పగ తీర్చుకుంటుంది. అయితే సుకుమార్‌ గారు.. ఆ సన్నివేశాన్ని, క్యారక్టర్‌ను మార్చి హీరోయిన్‌ను విలన్‌గా చూపించారు. ఆ మార్చు చేయడానికి మాకు ఏడు నెలల సమయం పట్టింది’’ అని కార్తీక్‌ తెలిపారు.

Updated Date - 2023-06-12T16:25:04+05:30 IST